Prakasam : 13 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం... ముఖంపై బండరాళ్లు విసిరి...

Published : Aug 22, 2023, 10:09 AM IST
Prakasam : 13 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం... ముఖంపై బండరాళ్లు విసిరి...

సారాంశం

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడి అతి దారుణంగా బండరాళ్లతో కొట్టిచంపారు గుర్తుతెలియని దుండగులు. ఈ అమానుష ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. 

ప్రకాశం : అభం శుభం తెలియని 13 ఏళ్ల  బాలికపై అత్యాచారానికి పాల్పడి దారుణంగా హతమార్చారు. లైంగిక దాడి తర్వాత చిత్రహింసలకు గురిచేసి చిన్నారి ముఖంపై బండరాళ్లు విసిరి చంపినట్లు మృతదేహాన్ని చూస్తే అర్థమవుతుంది. దుండగుల అతి క్రూరంగా వ్యవహరించి చిన్నారి ముఖాన్ని గుర్తుపట్టలేనట్లు చేసారు. ఈ అమానుష ఘటన ప్రకాశం జిల్లాలో వెలుగుచూసింది. 

స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం...  ప్రకాశం జిల్లా కనిగిరి మండలం ఎన్ గొల్లపల్లి శివారులో 13 ఏళ్ల బాలిక మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. ముఖం మొత్తం చిద్రమై ఒంటిపై బట్టలు లేకుండా అనుమానాస్పద రీతిలో బాలిక మృతదేహం పడివుంది. గ్రామస్తులు సమాచారం అందించడంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనాస్థలంలో దొరికిన స్కూల్ పుస్తకాల ఆదారంగా విద్యార్థినిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 

బాలికపై అత్యాచారానికి పాల్పడిన తర్వాతే ఇలా దారుణంగా చంపివుంటారని స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అత్యాచారం విషయం బయటపెడుతుందనే భయంతోనే బాలికను చంపారా? లేదంటే మరేదైనా కారణం వుందా అన్నది పోలీసుల విచారణలో తేలనుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Read More  గంజాయికి బానిసై ప్రియుడి ఆత్మహత్య.. అతడిని మర్చిపోలేక ప్రియురాలి బలవన్మరణం..

స్కూల్ నుండి బాలికను తీసుకువచ్చ ఇలా హత్యాచారానికి పాల్పడివుంటారని అనుమానిస్తున్నారు. బ్యాగ్  లోని పుస్తకాలపై వున్న పేరు, వివరాలను బట్టి బాలిక తల్లిదండ్రులను గుర్తించి సమాచారం  అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

YS Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలి.. జ‌గ‌న్ డిమాండ్‌
కోటంరెడ్డి వ్యాఖ్యలపై జగన్ ఫస్ట్ రియాక్షన్ | YS Jagan On Kotamreddy Sridhar Reddy | Asianet Telugu