యూ ట్యూబ్ లో చూసి.. చాకుతో గొంతు కోసుకుని బాలిక ఆత్మహత్య... !

Published : Sep 29, 2021, 05:00 PM IST
యూ ట్యూబ్ లో చూసి.. చాకుతో గొంతు కోసుకుని బాలిక ఆత్మహత్య... !

సారాంశం

 ఆమె తమ్ముళ్లు, భార్యల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు వీరి పోషణ విషయంలో కాదు. కానీ, ఈ గొడవలతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. యూ ట్యూబ్ లో బ్లేడ్ తో పీక కోసుకుని చనిపోవడం ఎలా? అనే వీడియో చూసింది. 

ఆంధ్రప్రదేశ్ : నేటి రోజుల్లో ప్రతీదీ యూట్యూబ్ లో దొరుకుతుంది. వంట చేయడం ఎలా.. అనే అంశం దగ్గరి నుంచి.. అణుబాంబులు తయారు చేయడం  ఎలా అనే వరకు.. ప్రతీదీ వీడియో రూపంలో.. ట్యుటోరియల్స్ రూపంలో యూ ట్యూబ్ లో అందుబాటులో ఉంటున్నాయి. దీనివల్ల చాలాసార్లు మంచి జరిగినా.. కొన్ని సార్లు చాలా నష్టం కూడా వాటిల్లుతుంది. అలాంటి దారుణమైన సంఘటనే తూర్పు గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ చిన్నారి.. యూ ట్యూబ్ వీడియోలు చూసి పీక కోసుకుని మరీ చనిపోయింది. 

కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ బాలిక ఆత్మహత్య (Suicide)చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటలో సోమవారం రాత్రి ఓ బాలిక (13), యూట్యూబ్ లో ఓ వీడియో  (YouTube video)చూసి.. తానూ అలాగే బ్లేడుతో పీక కోసుకుని (slitting throat) ఆత్మహత్య చేసుకుంది. అంబాజీపేటకు చెందిన ఓ మహిళ విజయవాడలో భర్తతో కలిసి ఉండేది. ఏడాది క్రితం భర్త కోవిడ్ తో మృతి చెందగా, అబ్బాయి, అమ్మాయితో కలిసి అంబాజీపేట వచ్చి పుట్టింట్లో ఉంటోంది. 

‘నీ భార్య నడవడిక సరిగా లేదు...’ అన్నందుకు వియ్యంకుడిని కత్తితో పొడిచి హత్య..

అయితే, ఆమె తమ్ముళ్లు, భార్యల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలు వీరి పోషణ విషయంలో కాదు. కానీ, ఈ గొడవలతో బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. యూ ట్యూబ్ లో బ్లేడ్ తో పీక కోసుకుని చనిపోవడం ఎలా? అనే వీడియో చూసింది. 

బ్లేడ్, చాకుతో పీక కోసుకుంటే చనిపోతారా.. అని తల్లిని అడగడంతో ఆమె మందలించింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి భోజనం అనంతరం బాలిక బాత్ రూమ్ కు వెళ్లి బ్లేడ్ తో పీక కోసుకుని గట్టిగా కేకలు వేసింది. కుటుంబ సభ్యులు వెంటనే చూసి అమలాపురం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలిక సోమవారం రాత్రి 11 గంటలకు మృతి చెందింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Reviews GSDP, RTGS & Pattadar Passbooks at AP Secretariat | Asianet News Telugu
Manchu Family Visits Tirumala: తిరుమల శ్రీవారి సేవలో మంచు ఫ్యామిలీ | Asianet News Telugu