స్నానం చేస్తుండగా వీడియో తీసి... బాలికపై లైంగిక దాడి..

Published : Jun 12, 2019, 07:53 AM IST
స్నానం చేస్తుండగా వీడియో తీసి... బాలికపై లైంగిక దాడి..

సారాంశం

మైనర్ బాలిక స్నానం చేస్తుండగా వీడియోలు తీసి... వాటిని చూపించి లైంగిక దాడులకు పాల్పడ్డారు. వాటిని తట్టుకోలేని చిన్నారి... ఆత్మహత్యకు యత్నించింది. ఈ విషాదకర సంగటన చిత్తూరు జిల్లా చంద్రగిరిలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...  చంద్రగిరి ప్రాంతానికి చెందిన బాలికకు తల్లి చనిపోయింది. తండ్రి వికలాంగుడు. దీంతో... బాలిక సంక్షేమ వసతి గృహంలో ఉంటూ.. చదువుకుంటోంది. కాగా.. బాలిక ఇటీవల వేసవి సెలవలకు నాయనమ్మ ఇంటికి వెళ్లింది.  అక్కడ బాలిక స్నానం చేస్తుండగా... ఓ వ్యక్తి ఫోన్ లో చిత్రీకరించాడు. 

వాటిని ఆ బాలికకు చూపి బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడి స్నేహితులైన మరో నలుగురికీ (వీరిలో ముగ్గురు మైనర్లు) ఈ అశ్లీల దృశ్యాలను షేర్‌ చేశాడు. వీటిని చూసి ఆ యువకులు కూడా ఆ బాలికను లైంగికంగా వేధించారు. వీరి వేధింపులు తాళలేక ఆమె తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. దీన్ని గమనించిన బాలిక నానమ్మ ఆరా తీయగా.. జరిగిన ఘటనను ఆమె చెప్పింది. గ్రామస్థుల సహకారంతో చంద్రగిరి పోలీసులను ఆశ్రయించారు. ఆ ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu