ఏపీ భవన్ విభజన : ముగిసిన కేంద్ర హోంశాఖ సమావేశం, కుదరని ఏకాభిప్రాయం.. మళ్లీ వచ్చేవారం

By Siva KodatiFirst Published Apr 26, 2023, 9:33 PM IST
Highlights

ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనకు సంబంధించి ఏపీ, తెలంగాణ అధికారులతో కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశం ముగిసింది. అయితే ఈ సమావేశంలోనూ సమస్యకు పరిష్కారం లభించలేదు.

ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనకు సంబంధించి ఏపీ, తెలంగాణ అధికారులతో కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమావేశం ముగిసింది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ సంజీవ్ కుమార్ జిందాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏపీ నుంచి ఆదిత్యనాథ్ దాస్, ప్రేమ చంద్రారెడ్డి, రావత్, హిమాన్షు కౌశిక్.. తెలంగాణ నుంచి రామకృష్ణారావు, గౌరవ్ ఉప్పల్ హాజరయ్యారు.

అయితే ఈ సమావేశంలోనూ సమస్యకు పరిష్కారం లభించలేదు. మరికొన్ని ప్రతిపాదనలు తెరపైకి రావడంతో వచ్చేవారం మరోసారి సమావేశం జరగనుంది. ఏపీ భవన్ విభజనకు సంబంధించి గతంలోనూ సమావేశాలు జరిగాయి. అయితే ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో సమస్య పరిష్కారం కాలేదు. జనాభా ప్రాతిపదికన 58:32 నిష్పత్తిలో ఏపీ భవన్‌ను పంచుకోవాలని కేంద్రం చెబుతుండగా.. దీనికి తెలంగాణ సర్కార్ అంగీకరించడం లేదు. 

Latest Videos


 

click me!