మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన తర్వాత మంత్రులు స్వంత వాహనాల్లో ఇంటికి వెళ్లిపోయారు. ఇవాళ కేబినెట్ సమావేశంలోనే మంత్రులు తమ రాజీనామా లేఖలను సీఎం జగన్ కు అందించారు.
అమరావతి: YS Jagan మంత్రివర్గంలో 24 మంది మంత్రులు తమ Resignation పత్రాలను సీఎం జగన్ కు అందించారు. Cabinet సమావేశం ముగిసిన తర్వాత మంత్రులు తమ స్వంత వాహనాల్లో ఇంటికి వెళ్లిపోయారు. మంత్రి పదవికి రాజీనామాలు సమర్పించినందున మంత్రులు తమ స్వంత వాహనాల్లో వెళ్లిపోయారు.
ఇవాళ ఏపీ రాష్ట్ర మంత్రివర్గం చివరి సమావేశం జరిగింది.ఈ సమావేశంలోAgendaపై చర్చించి ఎజెండాకు ఆమోదం తెలిపారు.పులివెందుల, కొత్తపేట రెవిన్యూ డివిజన్లు ఏర్పాటుకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత మంత్రుల రాజీనామా విషయమై సీఎం జగన్ చర్చించారు. పార్టీ అవసరాల రీత్యానే రాజీనామాలు చేయాలని అడగాల్సి వచ్చిందని సీఎం జగన్ చెప్పారు. అనుభవం రీత్యా కొందరిని మంత్రివర్గంలో కొనసాగిస్తామని సీఎం జగన్ చెప్పారు. నలుగురు లేదా ఐదుగురిని వచ్చే మంత్రివర్గంలో కొనసాగించే అవకాశం ఉంది. అనుభవం రీత్యా కొందరిని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉంది. మంత్రులను రాజీనామాలు కోరే సమయంలోనే సీఎం జగన్ కొంత బావోద్వేగానికి గురైనట్టుగా చెప్పారని సమాచారం.
ఈ నెల 11న మంత్రివర్గం పునర్వవ్యవస్థీకరణ చేయనున్నారు.మంత్రుల రాజీనామాలను జీఏడీ ఇవాళ గవర్నర్ కార్యాలయానికి పంపనున్నారు. ఈ రాజీనామాలపై గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొత్త కేబినెట్ లో పేర్లను సీఎం జగన్ గవర్నర్ కార్యాలయానికి పంపనున్నారు.ఈ ప్రక్రియ అంతా ఈ నెల 10వ తేదీకి పూర్తికానుంది. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని మంత్రివర్గం కూర్పు ఉండనుంది.