ఎంతమంది కలిసొచ్చినా.. జగన్‌ సింగిల్‌గానే, ఇద్దరి ముసుగు తొలగింది : బాబు, పవన్‌లకు వైసీపీ మంత్రుల కౌంటర్

Siva Kodati |  
Published : May 08, 2022, 09:41 PM ISTUpdated : May 08, 2022, 09:44 PM IST
ఎంతమంది కలిసొచ్చినా.. జగన్‌ సింగిల్‌గానే, ఇద్దరి ముసుగు తొలగింది : బాబు, పవన్‌లకు వైసీపీ మంత్రుల కౌంటర్

సారాంశం

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల పొత్తు వ్యాఖ్యలపై వైసీపీ మంత్రులు దాడిశెట్టి రాజా, కారుమూరి నాగేశ్వరరావులు కౌంటరిచ్చారు. ఇద్దరి మధ్యా ముసుగు తొలగిందని.. టెంట్ హౌస్ పార్టీని మరోసారి అద్దెకు ఇచ్చేందుకు పవన్ సిద్ధమయ్యారంటూ వారు వ్యాఖ్యానించారు. 

టీడీపీ (tdp) అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) , జనసేన (janasena) చీఫ్ పవన్ కల్యాణ్‌ల (pawan kalyan)  పొత్తు వ్యాఖ్యలపై వైసీపీ కౌంటరిచ్చింది. ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా (dadisetti raja) మాట్లాడుతూ.. చంద్రబాబుతో కలిసిపోడానికి పవన్ తహ తహలాడుతున్నాడని ఫైరయ్యారు. ఇదంతా ఓ పథకం ప్రకారమే జరుగుతోందని.. ముందు పవన్‌తో అనిపించి, తరువాత చంద్రబాబు అన్నాడని రాజా దుయ్యబట్టారు. టీడీపీతో పొత్తు ఉండదని పవన్ చెప్పింది మర్చిపోయాడెమోనంటూ మంత్రి చురకలు వేశారు. 

చంద్రబాబు పిలుపు కోసం చూస్తున్నా అంటున్న పవన్‌కి సిగ్గుందా అని దాడిశెట్టి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో పవన్‌కి సిద్దాంతం అంటూ లేదని.. పవన్ చంద్రబాబు కలిసి రాష్ట్రంలో రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని రాజా విమర్శించారు. ఇన్ని పార్టీలతో పొత్తుల డ్రామాలు ఆడే ఏకైక పార్టీ జనసేనేననంటూ మంత్రి ధ్వజమెత్తారు. ఎంత మంది కలిసినా జగన్ సింగిల్‌గానే ఉంటారని.. ప్రజలు ఆయన వెంటే ఉన్నారని దాడిశెట్టి రాజా స్పష్టం చేశారు. 

మరో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (karumuri nageswara rao) మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి (ys jagan mohan reddy) పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని అన్నారు. ఈ సుభిక్ష పాలనను అడ్డుకోవడానికి చంద్రబాబు అన్ని పార్డీలను పొత్తులకు పిలిచారని మంత్రి ఆరోపించారు. పొత్తులకు పిలిచిన వెంటనే సంకలు ఎగరేసుకుంటూ పవన్ కళ్యాణ్ వచ్చినట్లుగా వుందని కారుమూరి సెటైర్లు వేశారు. తన టెంట్ హౌస్ పార్టీని అద్దెకు ఇచ్చేందుకు సిద్దమయ్యాడని.. పవన్ కళ్యాణ్ అభిమానులు తనను సీఎం చేసుకోవడానికి చొక్కాలు చించుకుంటున్నారని మంత్రి చెప్పారు. కానీ పవన్ మాత్రం చంద్రబాబును సీఎం చేయడానికి చొక్కాలు చించుకుంటున్నాడని కారుమూరి చురకలు వేశారు. 

అభిమానుల ఆశయాలను తాకట్టు పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారని మంత్రి ఆరోపించారు. ఓ పక్క బీజేపీ (bjp) అధికారంలోకి వస్తుందని సోము వీర్రాజు (somu veerraju) చెబుతుంటే... పవన్ కళ్యాణ్ చంద్రబాబును అధికారంలోకి తెచ్చేందుకు చూస్తున్నారని నాగేశ్వరరావు ఫైరయ్యారు. బీజేపీ అధికారంలోకి రావడం ఇష్టం లేదా.. చంద్రబాబు మాత్రమే అధికారంలో ఉండాలా అంటూ ఆయన జనసేనానిని ప్రశ్నించారు. చంద్రబాబు , పవన్ కళ్యాణ్‌ల మధ్య ఉన్న ముసుగు నేటితో తొలిగిందని కారుమూరి నాగేశ్వరరావు దుయ్యబట్టారు. 

పవన్ కళ్యాణ్ ముసుగు వీడి చంద్రబాబు కోసం తన పార్టీని అద్దెకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారని మంత్రి ఆరోపించారు. చంద్రబాబు హయాంలో కాపులందరూ రోడ్డు ఎక్కితే... పవన్ కళ్యాణ్ నోరు విప్పలేదని నాగేశ్వరరావు మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాపుల కోసం ఉద్యమం చేసిన ముద్రగడ్డని, వాళ్ళ కుటుంబాన్ని అవమానించినప్పుడు... ఇదే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడని కారుమూరి ఫైరయ్యారు. జగన్మోహన్ రెడ్డిని గద్దె దించేందుకు ఎంత అనైతిక పొత్తుకైనా చంద్రబాబు, పవన్ సిద్దం అన్నట్లు వ్యవహరిస్తున్నారని నాగేశ్వరరావు మండిపడ్డారు. 

 

"

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan Powerful Speech: అమరజీవి జలధార పథకం శంకుస్థాపన | Jaladhara Scheme | Asianet News Telugu
Nara Lokesh Speech Krupa Pranganam Re-Consecration Ceremony in Mangalagiri | Asianet News Telugu