వేదికమీదే.. వైవీ సుబ్బారెడ్డికి మోకరిల్లి నమస్కరించిన మంత్రి వేణు.. ఎందుకంటే..

Published : Apr 30, 2022, 08:42 AM IST
వేదికమీదే.. వైవీ సుబ్బారెడ్డికి మోకరిల్లి నమస్కరించిన మంత్రి వేణు.. ఎందుకంటే..

సారాంశం

కరోనాతో నిరుడు మరణించిన కుడుపూడి చిట్టబ్బాయి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించినందుకు మినిస్టర్ వేణు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి మోకరిల్లారు.

అమలాపురం : మాజీ ఎమ్మెల్యే Kudupudi Chittabbai కుటుంబానికి ఎవరూ ఊహించని విధంగా ఆర్థిక సాయం అందించడానికి కారకులైన TTD చైర్మన్ YV Subba Reddy, ముఖ్యమంత్రి Jaganmohan Reddyలకు ఎన్ని జన్మలైనా శెట్టిబలిజలుగా శిరస్సువంచి నమస్కరిస్తా’ అంటూ రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వైవీ సుబ్బారెడ్డి ఎదుట మోకాళ్లపై కూర్చుని చేతులు జోడించారు.  

కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఎ. వేమవరంలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే కుడిపూడి చిట్టబ్బాయి సంస్మరణ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వై.వి.సుబ్బారెడ్డి వేదికపై కూర్చోగా మంత్రి వేణు ఆయన ముందు  మోకరిల్లాడు.  ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

ఇదిలా ఉండగా, అమలాపురం మాజీ ఎమ్మెల్యే, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల కుడిపూడి చిట్టబ్బాయి నిరుడు ఏప్రిల్ 29న కరోనాతో మరణించారు. అంతకు ముందు ఆయనలో కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో ఆయన  కాకినాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందారు. ఆ తరువాత అతడి ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించి ఏప్రిల్ 29న తుదిశ్వాస విడిచారు. 

మాజీ ఎమ్మెల్యే చిట్టబ్బాయి మరణవార్త తెలియగానే ముఖ్యమంత్రి జగన్ ఆయన కుటుంబసభ్యులకు ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన మృతికి సంతాపం ప్రకటించి కుటుంబానికి సానుభూతి తెలిపారు. చిట్టబ్బాయి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా వుంటానని ముఖ్యమంత్రి ఆయన కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో చలి తుపాను బీభత్సం.. ఆల్ టైమ్ రికార్డ్ టెంపరేచర్స్ తో ఇక్కడ అల్లకల్లోలమే