చంద్రబాబుకు దేవుడి పట్ల భక్తి , భయం లేదన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. అమరావతిలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన... దేవుడిపై భక్తి ఉంటే బూట్లు వేసుకుని పూజలు చేస్తారా..? అని వెల్లంపల్లి ప్రశ్నించారు
చంద్రబాబుకు దేవుడి పట్ల భక్తి , భయం లేదన్నారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు. అమరావతిలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన... దేవుడిపై భక్తి ఉంటే బూట్లు వేసుకుని పూజలు చేస్తారా..? అని వెల్లంపల్లి ప్రశ్నించారు.
తిరుపతిలో వెయ్యికాళ్ల మండపం కూల్చింది చంద్రబాబేనని ఆయన ఎద్దేవా చేశారు. బాబు కుమారుడు ట్విట్టర్‌లో ప్రమాణం చేస్తా అంటారని.. మీరు ఆలయానికి వెళ్లి ఎందుకు ప్రమాణం చేయలేదని శ్రీనివాసరావు నిలదీశారు.
అక్కడికెళ్లి అమరావతి గురించి మాట్లాడుతున్నారని... దేవుడి గురించి వెళ్లావా..? అమరావతి గురించి వెళ్లావా అని వెల్లంపల్లి మండిపడ్డారు. మీరు ఖబద్ధార్ జగన్ అంటే ఆయన భయపడతారా..? అని మంత్రి ఎద్దేవా చేశారు.
మీలాగా రిసార్టులకు దేవాలయ భూములు ఇవ్వలేదని... అసెంబ్లీకి వస్తామని కలలు కంటున్నారేమో, ఎన్నికలు వస్తే డిపాజిట్ కూడా రాదని వెల్లంపల్లి జోస్యం చెప్పారు. మీ కొడుకు సీఎం కావాలని దుర్గగుడిలో తాంత్రిక పూజలు చేయలేదా అని మంత్రి నిలదీశారు.
జై శ్రీరామ్ అని బీజేపీతో కలిసి పనిచేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని... జైశ్రీరామ్ అంటే మోడీ ఆయన్ను కాపాడరని వెల్లంపల్లి దుయ్యబట్టారు.