ఎన్టీఆర్ మరణానికి కారకుడైన చంద్రబాబుపై పగ తీర్చుకో.. బాలకృష్ణ‌పై మంత్రి రోజా ఫైర్..

Published : Sep 25, 2022, 03:07 PM IST
ఎన్టీఆర్ మరణానికి కారకుడైన చంద్రబాబుపై పగ తీర్చుకో.. బాలకృష్ణ‌పై మంత్రి రోజా ఫైర్..

సారాంశం

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఎన్టీఆర్ మరణానికి కారకుడైన చంద్రబాబుపై బాలకృష్ణ పగ తీర్చుకోవాలని రోజా అన్నారు. 

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఎన్టీఆర్ మరణానికి కారకుడైన చంద్రబాబుపై బాలకృష్ణ పగ తీర్చుకోవాలని రోజా అన్నారు. మంత్రి రోజా ఆదివారం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. అనంతరం రోజా మాట్లాడుతూ.. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధాని చేసి తీరుతామని అన్నారు. పాలన వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందాలని సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నాని అన్నారు. అయితే చంద్రబాబు మాత్రం రైతుల పేరుతో దొంగ పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. 

అమరావతిలో మాత్రమే రైతులు ఉన్నారా?.. రాయలసీమలో లేరా? అని ప్రశ్నించారు. హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై చంద్రబాబు నాయుడు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మూడు రాజధానులను అడ్డుకునేందుకు చంద్రబాబు నాయుడు రైతులను ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. 

Also Read: ప్లూటు బాబు ముందు ఊదు జ‌గ‌నన్న ముందు కాదు... తేడాలోస్తే దబిడి దిబిడే: బాలయ్యకు రోజా కౌంటర్

ఇక, అంతకుముందు హెల్త్ యూనివర్సిటీకి తన తండ్రి పేరు తొలగించడంపై నందమూరి బాలకృష్ణ ఘాటుగా స్పందించిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలపై స్పందించిన రోజా.. బాలకృష్ణ డైలాగ్ నే వాడుతూ ఆయనకే సెటైర్లు వేశారు. ‘‘బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు... జ‌గ‌న్ అన్న ముందు కాదు, అక్కడ ఉంది రీల్ సింహం కాదు.. జ"గన్" అనే రియల్ సింహం... తేడా వస్తే దబిడి దిబిడే..!!’’ అని రోజా కౌంటర్ ఇచ్చారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vijaysai Reddy Sensational Comments On YS Jagan | Asianet News Telugu
Annadata Sukhibhava: రైతుల‌కు ద‌స‌రా కానుక‌.. ఖాతాల్లోకి రూ. 6000 జ‌మ‌, ఎప్పుడంటే.?