
చంద్రబాబు నాయుడు చేసినవన్నీ 420 పనులేనని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. టీడీపీ మహానాడులో బూతు పురాణాలు తప్పు.. అక్కడ మంచి విషయాలు చర్చించలేదని అన్నారు. శనివారం ఆమె తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. మహానాడులో ఎన్టీఆర్ ఏం చేశారో, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాల్సింది పోయి.. బూతు మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం జగన్‌ను చూస్తే తడిసిపోతుందనే తీవ్ర పదజాలంతో విమర్శలు చేశారు.
బాలకృష్ణను చూస్తే నిజంగా చాలా బాధేస్తుందన్నారు. తండ్రి తగ్గ తనయుడిగా ఉంటే.. బాలకృష్ణ సీఎం అయ్యే చాన్స్ ఉండేందని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబం అమాయకత్వాన్ని చంద్రబాబు ఉపయోగించుకున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ కొడుకులను ఉపయోగించుకుని తర్వాత బయటపడేశారని ఆరోపించారు. చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారని అన్నారు. అధికారం కోసం ఆ కుటుంబాన్ని చంద్రబాబు వాడుకుంటున్నాడని విమర్శించారు.
చంద్రబాబు 14 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని ఎన్టీఆర్ ఊరు నిమ్మకూరు.. ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. బాలకృష్ణకు ఇన్నాళ్లు నిమ్మకూరు గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. నిమ్మకూరును అభివృద్ది చేయాలకుంటు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
బాలకృష్ణ అమాయకుడా, తెలియని తనమా అర్థం కాలేదని అన్నారు. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు ఆయన కుటుంబ సభ్యులు జగన్‌కు థాంక్స్ చెప్పాలని అన్నారు.
ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ ఎప్పుడో పోయిందన్నారు. ఇప్పుడున్నది నారా వారి తెలుగుదేశం పార్టీ అని.. కల్తీ టీడీపీ అని విమర్శించారు. బాలకృష్ణ.. ఆయన బావ చంద్రబాబు రాసిచ్చే స్ట్రిప్ట్ చదవడం మానేయాలన్నారు. ఎన్టీఆర్ అభిమానులు కోరుకునే విధంగా డైనమిక్ లీడర్‌గా ముందుకు వచ్చి టీడీపీ శ్రేణులను కాపాడాలన్నారు.
అంతకుముందు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆమె మీడిమాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేరు వింటనే చంద్రబాబు నాయుడు ఒంట్లో వణుకుపుడుతుందని విమర్శించారు. జూనియర్ ఎన్టీఆర్‌కు కూడా చంద్రబాబు భయపడ్డారని ఆరోపించారు. అందుకే ఆయనను పార్టీ నుంచి బయటకు తరిమేశారని అన్నారు. చంద్రబాబు ఆయన కొడుకు లోకేష్ పనికిరాడని.. దత్తపుత్రుడు పవన్‌ను కలుపుకున్నారని విమర్శించారు. 14 ఏళ్లలో చంద్రబాబు నాయుడు చేయలేనివి.. సీఎం జగన్ మూడేళ్లలో చేసి చూపించాడని అన్నారు.