ఏపీ వస్తే రోడ్లు చూపిస్తా.. కేటీఆర్‌పై గరం, ఆపై కేసీఆర్‌తో భేటీ : హాట్ టాపిక్‌గా రోజా వైఖరి

Siva Kodati |  
Published : Apr 29, 2022, 06:19 PM ISTUpdated : Apr 29, 2022, 06:56 PM IST
ఏపీ వస్తే రోడ్లు చూపిస్తా.. కేటీఆర్‌పై గరం, ఆపై కేసీఆర్‌తో భేటీ : హాట్ టాపిక్‌గా రోజా వైఖరి

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌పై కేటీఆర్ చేసిన  వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి ఆర్కే రోజా. కేటీఆర్‌ ఏపీ వస్తే రోడ్లు, సచివాలయాలు చూపిస్తానని ఆమె తెలిపారు. అనంతరం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో రోజా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.   

ఏపీలోని పరిస్ధితులు, పాలనపై మంత్రి కేటీఆర్ (ktr) చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా (rk roja) . కేటీఆర్ ఏపీ గురించి మాట్లాడినట్లు తనకు అనిపించడం లేదన్నారు. ఒకవేళ ఏపీ గురించి మాట్లాడి వుంటే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఏపీలో జరిగిన అభివృద్ధి , సంక్షేమం మరో రాష్ట్రంలో వుందా అని రోజా ప్రశ్నించారు. ఎవరో ఫ్రెండ్ చెబితే విని మాట్లాడటం కాదని.. కేటీఆర్ స్వయంగా వచ్చి చూస్తే ఏపీలో జరుగుతున్న అభివృద్ధి ఏంటో తెలుస్తుందన్నారు రోజా. 

ఏపీలో సచివాలయాలు (ap village secretariat) చూసి తమిళనాడులో (tamilnadu) ఏర్పాటు చేశారని ఆమె అన్నారు. ఏపీలో సచివాలయాలను కేటీఆర్‌కు చూపిస్తానని రోజా వ్యాఖ్యానించారు. దేశంలో మిగతా రాష్ట్రాల కంటే ఏపీని జగన్ ఎలా పాలిస్తున్నారో చూపిస్తానని ఆమె తెలిపారు. రోడ్లు ఏ విధంగా వున్నాయో చూపిస్తానని వెల్లడించారు. కేసీఆర్ ఆశీర్వాదం తీసుకోవడానికే ప్రగతి భవన్‌కు వచ్చినట్లు రోజా తెలిపారు. కేసీఆర్ తనను ఓ కూతురి మాదిరిగా చూస్తారని ఆమె అన్నారు. 

కాగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజా బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రముఖ దేవాలయాలను దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో రోజా భేటీ అయ్యారు. తెలుగుదేశం పార్టీలో (telugu desam party) వున్నప్పటి నుంచే కేసీఆర్‌కు మంత్రి రోజాకు సత్సంబంధాలు ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ను (kcr) అన్నా అని సంబోధిస్తారు రోజా. 

కొద్దిరోజుల క్రితం తమిళనాడు రాష్ట్రం కాంచీపురంలోని అత్తివరదరాజస్వామిని దర్శించుకునేందుకు సీఎం కేసీఆర్‌ కుటుంబంతోపాటు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే మార్గమధ్యంలో నగరి వద్ద మంత్రి రోజా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ కుటుంబంతో పాటే రోజా కూడా అత్తివరదరాజస్వామిని దర్శించుకున్నారు. అనంతరం తిరుగుప్రయణంలో నగరిలో ఆగారు. తన సతీమణి శోభ, కుమార్తె కవితతో కలిసి మంత్రి రోజా నివాసానికి కేసీఆర్‌ వెళ్లి భోజనం చేశారు. 

అయితే ఈ రోజు ఏపీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇలాంటి సందర్భంలో మంత్రి రోజా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవడం ఇరు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది.
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!
IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్