టీడీపీవి డ్రామాలే.. ఓటమికి సాకులు ముందే వెతుకుతున్నారు: బాబుకు పెద్దిరెడ్డి కౌంటర్

Siva Kodati |  
Published : Apr 17, 2021, 02:57 PM IST
టీడీపీవి డ్రామాలే.. ఓటమికి సాకులు ముందే వెతుకుతున్నారు: బాబుకు పెద్దిరెడ్డి కౌంటర్

సారాంశం

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించడంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కౌంటర్ ఇచ్చారు. 

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించడంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కౌంటర్ ఇచ్చారు.

శనివారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. పోలింగ్‌పై టీడీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందంటూ ఎద్దేవా చేశారు. బస్సుల్లో వెళ్లే ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని... ప్రశాంతంగా జరుగుతున్న పోలింగ్‌ను అడ్డుకునేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని మంత్రి మండిపడ్డారు.

దొంగ ఓట్ల పేరుతో టీడీపీ డ్రామాలు ఆడుతోందని...  ఓటమికి ముందే దొంగఓట్ల పేరుతో టీడీపీ సాకులు వెతుక్కుంటోందంటూ దుయ్యబట్టారు. ప్రజా బలం లేకే టీడీపీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:జగన్ అనే వ్యక్తి కోసం కాదు: తిరుపతి ఎన్నికపై చంద్రబాబు అసహనం

తనపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని మంత్రి హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసం వైఎస్సార్‌సీపీపై అభాండాలు వేస్తున్నారు. టీడీపీ కుట్రలపై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తాం.

ఓటమి భయంతోనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని పెద్దిరెడ్డి మండిపడ్డారు. ఓటమికి కారణాలు వెతుక్కోవడం మాని.. తన తప్పులు తెలుసుకుంటే ప్రజల్లో ఉంటారని రామచంద్రారెడ్డి హితవు పలికారు.

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?