ఆ విషయంలో కేసీఆర్ ని ఫాలో అవుతాం.. ప్రత్తిపాటి

Published : Sep 19, 2018, 10:51 AM IST
ఆ విషయంలో  కేసీఆర్ ని ఫాలో అవుతాం.. ప్రత్తిపాటి

సారాంశం

శాసనసభలో ప్రతిపక్ష పాత్రనూ తామే పోషించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినట్లు పేర్కొన్నారు.

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో భాగంగా.. కేసీఆర్ తమ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఇదే కోవలో ఏపీలో టీడీపీ అభ్యర్థుల జాబితాను ముందుగానే ప్రకటిస్తామని ఏపీ రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. గెలిచేవారికి మాత్రమే టిక్కెట్లు ఇస్తామని.. ఆ దిశగా కసరత్తు ప్రారంభమైందని చెప్పారు. 

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్టకు మంత్రి పుల్లారావు, జిల్లా తెదేపా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు భూమి పూజ నిర్వహించారు. ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్న సీపీఎస్ రద్దు విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని జీవీ ఆంజనేయులు చెప్పారు. శాసనసభలో ప్రతిపక్ష పాత్రనూ తామే పోషించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసినట్లు పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ
Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు