యువకుడికి యువతి బెదిరింపులు

Published : Sep 19, 2018, 09:46 AM IST
యువకుడికి యువతి బెదిరింపులు

సారాంశం

డబ్బులు ఇవ్వకపోతే.. నీ న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ ఓ యువకుడిని మహిళ బెదిరించడం గమనార్హం.


ఇప్పటి వరకు ఎందరో అమ్మాయిలు.. ప్రేమ పేరుతో అబ్బాయిల చేతుల్లో మోసపోయి ఉంటారు. ఫోటోలను చూపించి డబ్బులు వసూలు చేసి ఉంటారు. అందుకు పూర్తి భిన్నంగా విజయవాడలో ఓ సంఘటన చోటుచేసుకుంది. డబ్బులు ఇవ్వకపోతే.. నీ న్యూడ్ ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ ఓ యువకుడిని మహిళ బెదిరించడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే...గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన 23 ఏళ్ల ఓ యువకుడు బ్యాటరీల పనిచేస్తుంటాడు. అతనికి ఫేస్‌బుక్‌ ద్వారా ఓ యువతి పరిచయం అయింది. తరచుగా ఇద్దరూ ఛాటింగ్‌ చేసుకునేవారు. తాను గుంటూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్నానని, తనకు వివాహమైందని, భర్త హైదరాబాద్‌లో పనిచేస్తాడని, ఒక పాప కూడా ఉందని ఆ యువతి చెప్పింది. ఇటీవల ఆమె తన నగ్నచిత్రం అంటూ ఓ ఫొటోను ఫేస్‌బుక్‌లో యువకుడికి పోస్టు చేసింది. 

నువ్వు కూడా నీ నగ్నచిత్రాన్ని పంపించాలంటూ, యువకుడిని కోరడంతో అతడూ పంపాడు. మరుసటి రోజు నుంచి ఆ యువతి తనకు డబ్బు అవసరం ఉందని,  ఇవ్వకపోతే నీ ఫొటోను అన్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టేస్తానంటూ బెదిరించడం ప్రారంభించింది. ఆ యువకుడు విజయవాడ అశోక్‌నగర్‌లోని తన అక్క, బావ ఇంటికి వచ్చాడు. అక్కడ ఉండగా యువతి ఫోన్‌ చేసి బెదిరించిన విషయం వారి దృష్టికి వెళ్లడంతో అందరూ కలిసి పటమట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాల్లో తమ వ్యక్తిగత విషయాలు, ఫొటోలు పెట్టి మోసపోవద్దని, సామాజిక మాధ్యమాలు వినియోగించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని పటమట సీఐ ఉమామహేశ్వరరావు ప్రజలకు సూచించారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?