జీవీఎల్ ఎవరు..?: నారా లోకేష్ ప్రశ్న

First Published Jun 5, 2018, 10:16 AM IST
Highlights

ప్రశ్నించిన లోకేష్

ఏపీ ఐటీశాఖ మంత్రి లోకేష్.. తన రాజకీయ ప్రత్యర్థులను ట్విట్టర్ ద్వారా టార్గెట్ చేస్తున్నారు. ప్రత్యర్థులు చేసే కామెంట్లకు ఆయన ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత జీవీఎల్ నర్సింహారావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేష్ ట్విట్టర్‌ ద్వారా కౌంటర్ ఇచ్చారు. 

ఏపీ ప్రభుత్వం సమర్పించిన యూసీలు సరిగా లేవని చెప్పడానికి జీవీఎల్‌ ఎవరు? అని ప్రశ్నించారు. సమర్పించిన యూసీలు సరిగా లేకపోతే కేంద్రంలోని ఆయా శాఖలు వివరణ అడుగుతాయి కదా అని అన్నారు. వెనుక బడిన జిల్లాలకు కేటాయించిన రూ. 1000 కోట్ల నిధులకు సంబంధించిన యూసీలు ఇప్పటికే సమర్పించామని, కేంద్ర శాఖలు కూడా ఆమోదించాయని ట్వట్టర్‌లో మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
 
అమరావతిలో డ్రైనేజీ పనులకు నిధులు విడుదల చేయలేదన్నారు. విజయవాడ, గుంటూరు నగరాలకు మాత్రమే నిధులు విడుదల చేశారని తెలిపారు. ఇప్పటి వరకు అయిన రూ.349 కోట్ల పనులకు యూసీలు సమర్పించామని వెల్లడించారు. 

ఇప్పటి వరకు అమరావతికి కేంద్రం ఇచ్చింది రూ.1500 కోట్లు మాత్రమే అని మంత్రి చెప్పారు. రూ. 1583 కోట్లకు యూసీలు సమర్పించామని...వాటినీ ఆమోదించారని మంత్రి తెలిపారు. ఏ ఊహాజనిత ప్రాజెక్ట్‌కు రూ.8962 కోట్లు విడుదల చేశారో జీవీఎల్‌ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తమరు చెప్పినవి అబద్దాలు అని ఒప్పుకోవాలని ట్విట్టర్‌ వేదికగా జీవీఎల్‌కు మంత్రి లోకేష్‌ సవాల్ విసిరారు.

click me!