ముందు మీ ఆరోగ్యం జాగ్రత్త: చంద్రబాబుకు కన్నబాబు సూచనలు

Siva Kodati |  
Published : Oct 04, 2020, 03:06 PM IST
ముందు మీ ఆరోగ్యం జాగ్రత్త: చంద్రబాబుకు కన్నబాబు సూచనలు

సారాంశం

ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 

ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆదివారం కాకినాడలో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు ఇంకా తాను అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిలా భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు.

కరోనా నియంత్రణ చర్యల్లో దేశం‌ మొత్తంలో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్ వన్ స్ధానంలో ఉందని మంత్రి ప్రశంసించారు. చక్కటి పరిపాలనతో జగన్‌ కరోనాను ఎదుర్కోంటున్నారని.. ఇప్పుడొచ్చి చంద్రబాబు కరోనా సమస్యలపై తమ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని అంటున్నారని సెటైర్లు వేశారు.

కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు తండ్రి కొడుకులు హైదరాబాద్‌లో ఉండి గుమ్మం దాటి బయటకు రాలేదని కన్నబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబుకు అమరావతి, అచ్చెన్నాయుడు గోల తప్ప ప్రజల గురించిన ఆలోచన లేదని మంత్రి విమర్శించారు.

పరిపాలన కోసం సీఎంకి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి చంద్రబాబుతో చెప్పించుకోవాల్సిన అవసరం లేదని కన్నబాబు స్పష్టం చేశారు. కరోనా రాకుండా ముందు చంద్రబాబు జాగ్రత్త పడాలని సూచించారు.

ప్రజల కోసం ప్రతిపక్షనేత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు... ఎక్కువ టెన్షన్ పడితే ఆయన ఆరోగ్యానికి ఇబ్బందులు రావొచ్చని హితవు పలికారు. కోవిడ్ తగ్గే వరకు ఇంట్లో ఉండి విశ్రాంతి తీసుకుంటే మంచిదని చంద్రబాబును కోరుతున్నా అని కన్నబాబు వ్యాఖ్యానించారు. 

PREV
click me!

Recommended Stories

జగన్‌కు రాఖీలు కట్టిన వైసీపీ కార్యకర్తలు | YS Jagan Celebrate Rakhi Pournami
Andhra pradesh: ఏపీ ప్ర‌భుత్వం మ‌రో కీలక నిర్ణ‌యం.. రాష్ట్ర‌వ్యాప్తంగా సంజీవ‌ని ప్రాజెక్టు