కుటుంబ సభ్యుల నుంచే చంద్రబాబుకు హాని.. ఏం జరిగినా భువనేశ్వరి, లోకేష్‌లదే బాధ్యత : కొట్టు సత్యనారాయణ

చంద్రబాబుకు కుటుంబ సభ్యుల నుంచే హాని వుండొచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.  తన కుటుంబ సభ్యులే తనపై కుట్రలు చేసి అంతరం చేస్తారే భయాలు చంద్రబాబులో వున్నాయని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు.

minister kottu satyanarayana sensational comments on tdp chief chandrababu naidu ksp

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబుకు కుటుంబ సభ్యుల నుంచే హాని వుండొచ్చంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ఏం జరిగినా దానికి బాధ్యత లోకేష్, భువనేశ్వరిలదేనని కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులే తనపై కుట్రలు చేసి అంతరం చేస్తారే భయాలు చంద్రబాబులో వున్నాయని మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే భువనేశ్వరి స్పందించలేదన్నారు. 

అంతకుముందు విజయవాడ దుర్గగుడిలో దసరా ఏర్పాట్లు అన్నీ పరిశీలించామన్నారు  కొట్టు సత్యనారాయణ. శనివారం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుతో కలిసి ఆయన ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కొట్టు సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రణాళిక ప్రకారం అన్ని ఏర్పాట్లు జరిగాయన్నారు. కేశఖండన చేసుకున్న వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసామన్నారు. ఇటీవల కొండచరియలు విరిగిపడిన దగ్గర తగు జాగ్రత్తలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. సబ్ కలెక్టర్ కార్యాలయం, వీఎంసీలో ఒక టికెట్ కౌంటర్ పెట్టామని ఆయన వెల్లడించారు. 3500 మంది పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని కొట్టు సత్యనారాయణ చెప్పారు. 

Latest Videos

ALso Read: జైలులో చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై వైద్యుల కీలక నివేదిక..

ప్రోటోకాల్ వీవీఐపీలకు మాత్రమే అంతరాలయ దర్శనం అందిస్తామని మంత్రి చెప్పారు. పాలు , మజ్జిగ , బిస్కెట్లు క్యూలైన్లు లో ఏర్పాటు చేస్తామని కొట్టు సత్యనారాయణ తెలిపారు. సీఎం రాకకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని..  బిఎస్ఎన్ఎల్, ఫైబర్ నెట్, యాక్ట్ నుంచీ కనెక్షన్లు దసరాకు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. కొండచరియలు విరిగిపడకుండా జాగ్రత్తలు తీసుకున్నామని.. వృద్ధులకు ఉదయం, సాయంత్రం రెండు స్లాట్లు ఉంటాయని కొట్టు సత్యనారాయణ తెలిపారు. సేవాసమితుల ఆధ్వర్యంలో వృద్ధులకు సేవలు అందిస్తామని మంత్రి చెప్పారు. 

vuukle one pixel image
click me!