పవన్ గిరిజనులను రెచ్చగొడుతున్నారు.. మంత్రి కిడారి

By ramya neerukondaFirst Published 24, Jan 2019, 3:59 PM IST
Highlights

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గిరిజనులను రెచ్చగొడుతున్నారని మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ ఆరోపించారు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గిరిజనులను రెచ్చగొడుతున్నారని మంత్రి కిడారి శ్రవణ్ కుమార్ ఆరోపించారు. ఇటీవల పవన్ కళ్యాణ్.. కిడారి, సోమ హత్యలకు చంద్రబాబే కారణం అంటూ వ్యఖ్యాలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కామెంట్లపై తాజాగా మంత్రి కిడారి శ్రవణ్ స్పందించారు.

బాక్సైట్ తవ్వకాలకు తమ ప్రభుత్వం వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పవన్ కళ్యాణ్ సభలు పెట్టి గిరిజనులను రెచ్చగొట్టడం సరికాదన్నారు. గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

ఎజెన్సీ ప్రాంతాల్లో అధికారులు బాగా పనిచేయాలని, అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు. 

Last Updated 24, Jan 2019, 3:59 PM IST