ముసలినక్క చంద్రబాబు ఎవ్వరితో కలిసొచ్చినా... జగన్ సింహం సింగిల్ గానే : మంత్రి కారుమూరి

Published : Aug 10, 2023, 06:04 PM IST
ముసలినక్క చంద్రబాబు ఎవ్వరితో కలిసొచ్చినా... జగన్ సింహం సింగిల్ గానే : మంత్రి కారుమూరి

సారాంశం

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముసలినక్క, దుర్మార్గుడు అయితే సీఎం జగన్ సింహం లాంటివాడని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. 

విజయవాడ : ప్రతిపక్ష టిడిపి, బిజెపి, జనసేన పార్టీలు కలిసివచ్చి జగన్మోహన్ రెడ్డి సింహంలా సింగిల్ గానే వస్తాడని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ముసలినక్క చంద్రబాబుకు గెలుపుపై నమ్మకంలేదు కాబట్టే ఇతర పార్టీలతో పొత్తులకోసం ఎదురుచూస్తున్నాడని అన్నారు. ఇప్పటికే సర్వేలన్ని తమ గెలుపునే సూచిస్తున్నాయని... టైమ్స్ నౌ సర్వేలో వైసిపికి మళ్లీ 24 ఎంపీ సీట్లు వస్తాయని తేలిందని మంత్రి నాగేశ్వరరావు గుర్తుచేసారు. 

వైసిపి ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను విమర్శించే ఏ పార్టీ నాయకులకైనా ప్రజల వద్దకు వెళ్లే దమ్ముందా? అని మంత్రి కారుమూరి ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల్లోని నాయకులు తప్ప కార్యకర్తలు ఎవ్వరూ వైసిపి ప్రభుత్వంపై విమర్శలు చేయడంలేదన్నారు. ఈ ప్రభుత్వంలో అన్ని పార్టీల వారికీ పథకాలు అందుతున్నాయి... అందుకే ఆయా పార్టీల కార్యకర్తలు తమకు మద్దతుగా నిలుస్తున్నారని మంత్రి అన్నారు.

ఓటమి భయంతోనే చంద్రబాబు రాష్ట్రంలో అరాచకాలు సృష్టించడానికి సిద్దమయ్యాడని  మంత్రి ఆరోపించారు. అందుకే పుంగనూరులో తరమండిరా, నా కొడకల్లారా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతూ రౌడీలా వ్యవహరించాడని అన్నారు. దీంతో టిడిపి శ్రేణులు రెచ్చిపోయినా పుంగనూరులో పోలీసులకు సంయమని పాటించారని అన్నారు. టిడిపి శ్రేణుల దాడిలో రక్తమోడుతున్నా తుపాకులకు పనిచెప్పకుండా సంయమనంతో వ్యవహరించిన పోలీసులకు చేతులెత్తి దండం పెట్టాలన్నారు మంత్రి  కారుమూరి. 

Read More  సినీ రంగమేమి ఆకాశం నుంచి ఊడిపడలేదు.. ఆ బాధ్యత ప్రభుత్వానిదే: చిరుకు విజయసాయిరెడ్డి కౌంటర్‌!

తన రాజకీయ స్వార్థంకోసమే ఏపీలో శాంతిభద్రతలు అదుపులో లేవని చూపించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని మంత్రి అన్నారు. ఇందులో భాగంగానే రెచ్చగొట్టే మాటలతో గొడవలు సృష్టిస్తున్నాడని అన్నారు. ఈ గొడవల్లో గాయపడ్డ టిడిపి కార్యకర్తల కుటుంబాల ఉసురు చంద్రబాబుకు తగులుతుందని అన్నారు.  

ఇక లోకేష్, పవన్ కల్యాణ్ లపైనా మంత్రి కారుమూరి మండిపడ్డారు. లోకేష్ అసలు రాజకీయ నాయకుడే కాదు... ఆయనో పప్పు అంటూ ఎద్దేవా చేసారు. ఎన్ని కేసులు పెట్టించుకుంటే అంత పెద్ద పదవులిస్తానంటాడా... ఇదెక్కడి రాజకీయం అంటూ మండిపడ్డారు. ఒక రాజకీయ పార్టీలో కీలక నాయకుడిగా వున్న లోకేష్ కార్యకర్తలకు ఇలాగేనా చెప్పేది అంటూ మంత్రి మండిపడ్డారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా తాటతీస్తా...పంచలూడదీస్తా అంటున్నాడు... ఇది కరెక్టేనా? అని మంత్రి నిలదీసారు. మన స్థాయి ఏంటి..మన బ్రతుకేంటి అని ఆలోచించుకుని మాట్లాడితే బావుంటుందని అన్నారు. సినిమాను సినిమాగా..రాజకీయాలను రాజకీయాలుగా చూడాలన్నారు. అంతేకానీ సినిమాకు రాజకీయాలను జోడించి చూడటం సరికాదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సూచించారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?