కాంగ్రెస్ తో పొత్తు.. కళా వెంకట్రావు ఎమన్నారంటే..

By ramya neerukondaFirst Published Aug 24, 2018, 2:22 PM IST
Highlights

పొత్తులు ఎవరితో పెట్టుకోవాలో పోలిట్ బ్యూరోలో చర్చ జరుగుతుందని, అయితే... తుది నిర్ణయం మాత్రం పార్టీ అధినేత చంద్రబాబుదేనని కళా వెంకట్రావు అన్నారు.

2019 ఎన్నికలు మరెంతో దూరంలో లేవు. ఇప్పటికే పలు పార్టీల నేతలు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంప్ చేస్తున్నారు. ఇక ఏ పార్టీ.. మరేపార్టీతో పొత్తు పెట్టుకుంటుందనే విషయం కూడా ఆసక్తిగా మారుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వార్తలు వినపడుతున్నాయి. ఇదే విషయం మంత్రి కళా వెంకట్రావు వద్ద ప్రస్తావించగా ఆయన స్పందించారు.

శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో పొత్తుపై మాట్లడారు. పొత్తులు ఎవరితో పెట్టుకోవాలో పోలిట్ బ్యూరోలో చర్చ జరుగుతుందని, అయితే... తుది నిర్ణయం మాత్రం పార్టీ అధినేత చంద్రబాబుదేనని కళా వెంకట్రావు అన్నారు.
 
ఆ తర్వాత  బీజేపీ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఉత్తరాంధ్రలో విమానాశ్రయం వస్తే తప్పేంటో అర్ధంగావడం లేదని, ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగడం బిజేపికి ఇష్టం లేదా? అని కళా వెంకట్రావు ప్రశ్నించారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మాణంపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసి బీజేపీ నేతలు రాష్ట్రాభివృధ్ధికి అడ్డం పడుతున్నారని ఆయన అన్నారు. అలాగే బీజేపీకి వైసీపీ వత్తాసు పలుకుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా అభివృధ్ధిలో నడిపించేందుకు చంద్రబాబునాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు.

click me!