చంద్రబాబు జీవితం చీకటిమయమైంది.. వ్యవస్థలను మేనేజ్ చేసే పనిలో లేకేష్ : కాకాణి గోవర్ధన్ రెడ్డి

Siva Kodati |  
Published : Oct 08, 2023, 04:01 PM IST
చంద్రబాబు జీవితం చీకటిమయమైంది.. వ్యవస్థలను మేనేజ్ చేసే పనిలో లేకేష్ : కాకాణి గోవర్ధన్ రెడ్డి

సారాంశం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. లోకేష్ ఢిల్లీలో వ్యవస్థలను మేనేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని .. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ప్రజలు రావడం లేదని మంత్రి చురకలంటించారు. 

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ఆదివారం నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు చంద్రబాబు అరెస్ట్ అక్రమం అంటున్నారని, కానీ ఆయన అవినీతి గురించి మాత్రం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ వ్యాప్తంగా స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాల కోసం రూ.3,700 కోట్లను విడుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చారని.. ఈ నిధుల విషయంలోనే అవినీతికి పాల్పడ్డారని కాకాణి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ప్రజలు రావడం లేదని, ప్రజల్లో చంద్రబాబుకు ఎంత పరపతి వుందో దీనిని చూస్తే అర్ధమవుతుందని గోవర్ధన్ రెడ్డి చురకలంటించారు. 

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అవినీతి జరిగిందని ఇప్పటికే ఐటీ, ఈడీలు నిర్ధారించాయని మంత్రి పేర్కొన్నారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేని కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు జీవితం చీకటిమయమైందని మంత్రి దుయ్యబట్టారు. లోకేష్ ఢిల్లీలో వ్యవస్థలను మేనేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. మంత్రి రోజాపై టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి చేసిన వ్యాఖ్యలపైనా మంత్రి స్పందించారు. 

Also Read: అవినీతి కేసులో అరెస్ట్.. చంద్రబాబు విప్లవకారుడిలా కనిపిస్తున్నారా : టీడీపీపై సజ్జల ఆగ్రహం

ఇది మంచి పద్దతి కాదని.. అందుకే రోజాకే అంతా అండగానిలిచారని గుర్తుచేశారు. గతంలో ఎవరూ ఈ స్థాయిలో విమర్శలు చేయలేదని.. మహిళ అని చూడకుండా బండారు చేసిన వ్యాఖ్యలతో సభ్య సమాజం తలదించుకుంటోందని గోవర్ధన్ రెడ్డి దుయ్యబట్టారు. రైతు భరోసా కేంద్రాలకు ప్రధాని పేరు కూడా పెట్టామని.. మీలాగా కేంద్ర పథకాలకు స్టిక్కర్ తగిలించుకోలేదని ఎద్దేవా చేశారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Odisha Governor Kambhampati Hari Babu Speechవిశాఖలో ఘనంగా మహా సంక్రాంతి వేడుకలు| Asianet News Telugu
CM Chandrababu at Naravaripalli నారావారి పల్లి లో గోమాతకి పూజ చేసిన సీఎం చంద్రబాబు| Asianet Telugu