చంద్రబాబు అధికారంలోకి వస్తే పథకాలు తీసేస్తారు.. ధర్మాన ప్రసాదరావు

Published : Sep 24, 2022, 05:18 PM IST
చంద్రబాబు అధికారంలోకి వస్తే పథకాలు తీసేస్తారు.. ధర్మాన ప్రసాదరావు

సారాంశం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ప్రస్తుత ఉన్న పథకాలను తీసేస్తారని అన్నారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ప్రస్తుత ఉన్న పథకాలను తీసేస్తారని అన్నారు. విపక్ష నేతలు ధరలు పెరిగాయని ఆరోపణలు చేస్తున్నారని.. పక్క రాష్ట్రాల్లో ధరలు ఏమైనా తక్కువగా ఉన్నాయా? అని ప్రశ్నించారు. 

ఇదిలా ఉంటే.. టీడీపీ అధినేత, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై మండిపడ్డారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నోరు విప్పితే అన్నీ అబద్ధాలే వస్తాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి వైఎస్సార్ ఎంతో కృషి చేశారని గోవర్థన్ రెడ్డి ప్రశంసించారు. అందువల్ల హెల్త్ యూనివర్సిటీకి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టడమే సరైనదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై చంద్రబాబు నాయుడు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని కాకాణి మండిపడ్డారు. 

Also Read: ఎన్టీఆర్ కుమారులు పరమశుంఠలు.. బాలకృష్ణకు పునర్జన్మనిచ్చింది వైఎస్సార్‌: మంత్రి జోగి రమేష్ సంచలన కామెంట్స్

తాను అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు వచ్చాయని చంద్రబాబు చెబుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీని తామే కట్టామని చెబుతున్నారని, కానీ అది పచ్చి అబద్ధమని మంత్రి చురకలు వేశారు. 2013 ఏప్రిల్ 3న ఆ మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేశారని, 2013 ఆగస్ట్ 24న ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజీగా నామకరణం చేశారని కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఆ కాలేజీకి చంద్రబాబు ప్రారంభోత్సవం చేయడం తప్పించి చేసిందేమీ లేదని ఆయన చురకలు వేశారు. 

PREV
click me!

Recommended Stories

దేవరపల్లిలో అడుగుపెట్టిన జగన్ భారీగా తరలి వచ్చిన ఫ్యాన్స్ | YS Jagan East Godavari Tour Devarapalli
రైస్ తింటే క్యాన్సర్ వస్తుందంట చంద్రబాబుపై జగన్ పంచ్ లు | YS Jagan East Godavari Tour | Devarapalli