ఉద్యమంలోకి వెళ్లాలనుంది.. జగన్ అనుమతిస్తే రాజీనామా చేస్తా : ధర్మాన సంచలన వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Oct 07, 2022, 05:00 PM ISTUpdated : Oct 07, 2022, 05:11 PM IST
ఉద్యమంలోకి వెళ్లాలనుంది.. జగన్ అనుమతిస్తే రాజీనామా చేస్తా : ధర్మాన సంచలన వ్యాఖ్యలు

సారాంశం

సీఎం జగన్ అనుమతిస్తే పదవికి రాజీనామా చేస్తానని మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు . ఉద్యమంలోకి వెళ్లిపోదామన్న ఆలోచన వుందని.. అన్యాయాన్ని అరికట్టడానికి ప్రయత్నిస్తానని ధర్మాన అన్నారు. 

విశాఖ పరిపాలనా రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. సీఎం జగన్ అనుమతిస్తే పదవికి రాజీనామా చేస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఉద్యమంలోకి వెళ్లిపోదామన్న ఆలోచన వుందని.. అన్యాయాన్ని అరికట్టడానికి ప్రయత్నిస్తానని ధర్మాన అన్నారు. మన పిల్లల భవిష్యత్ కోసం ఎవరూ తగ్గొద్దని మంత్రి పిలుపునిచ్చారు. విశాఖలో రాజధాని ఏర్పాటైతేనే మన భవిష్యత్ బాగుంటుందని ధర్మాన అన్నారు. దీని కోసం త్యాగాలు చేయాల్సిన అవసరం లేదని.. మా పీక కోసేందుకు అమరావతి నుంచి అరసవల్లికి స్తారా అంటూ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ రాజధానికి అడ్డొస్తే రాజకీయంగా చితక్కొట్టాలని ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?