భారత్ జోడోయాత్రలో పాల్గొంటా, రాజకీయాలకు సెలవే: మాజీ మంత్రి రఘువీరారెడ్డి

By narsimha lode  |  First Published Oct 7, 2022, 3:34 PM IST

భారత్ జోడో యాత్రలో పాల్గొంటానని మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రకటించారు. అయితే రాజకీయాలకు దూరంగానే ఉంటానని ఆయన తేల్చి చెప్పారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మంత్రిగా, కాంగ్రెస్ నేతగా  రఘువీరారెడ్డి క్రియాశీలకంగా  పనిచేశారు. 3ఏళ్ల నుండి  రాజకీయాలకు దూరంగా ఉన్నారు.


అనంతపురం: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొంటానని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి ప్రకటించారు.  తన స్వగ్రామంలో  గ్రామస్తులతో రఘువీరారెడ్డి శుక్రవారం నాడు సమావేశమయ్యారు. రాహుల్ గాంధీని కలిసితమ స్వగ్రామానికిచెందిన ఆలయానికి దేవుడి తీర్థ ప్రసాదాలు అందించనున్నట్టుగా తెలిపారు. అయితే రాజకీయాలకు సెలవు కొనసాగుతుందని ఆయనతేల్చి చెప్పారు. రాజకీయాల్లో  క్రియాశీలకంగా పాల్గొనాలని భావిస్తే అప్పుడు అందరికి చెబుతానన్నారు.

మూడేళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు రఘువీరారెడ్డి దూరంగా ఉంటున్నారు. తన స్వంత గ్రామం నీలకంఠపురం గ్రామానికే పరిమితమయ్యాడు. గ్రామంలో ఆలయ నిర్మాణం కోసం రఘువీరారెడ్డి గ్రామస్తులతో కలిసి ప్రయత్నిస్తున్నారు. ఆలయంతో పాటు గ్రామాభివృద్ది కోసం రఘువీరారెడ్డి  తన వంతు సహకారం అందిస్తున్నారు.

Latest Videos

undefined

రాహుల్ గాంధీ భారత్ జోడోయాత్ర విజయవవంతం చేసేందుకు గాను  ఇటీవలనే కాంగ్రెస్ నేతలు కర్నూల్ లో సమావేశమయ్యారు.ఈ సమావేశానికి రఘువీరెడ్డిని కూడాఆహ్వానించారు.ఈ సమావేశానికి ఆయన హాజరు కాలేదు అయితే రాహుల్ గాంధీ పాదయాత్రకు మాత్రం హాజరుకానున్నట్టుగా ఆయన ఇవాళ ప్రకటించారు. 

రఘువీరారెడ్డిని రాజకీయాల్లో యాక్టివ్ గా  పాల్గొనేలా చేయాలని కొందరు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కర్నూల్ సమావేవానికి ఆయనను ఆహ్వానించారు.  కానీ ఆయన ఈ సమావేశానికి వెళ్లేలేదు. కేవీపీ రాసిన  పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమంలోనే ఆయన పాల్గొన్నారు. కానీ ఇతర కార్యక్రమాల్లో  రఘువీరారెడ్డి పాల్గొనలేదు.

రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని  బలోపేతం చేసేందుకు రఘువీరారెడ్డి పనిచేశారు. 2019 ఎన్నికల తర్వాత రఘువీరారెడ్డి  క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు.  రఘువీరారెడ్డి పీసీసీ పదవి నుండి  తప్పుకున్న తర్వాత  శైలజానాథ్ ఏపీసీసీ చీఫ్ గా కొనసాగుతున్నారు.  పలువురు కాంగ్రెస్ కీలక నేతలు రఘువీరారెడ్డితో సమావేశమయ్యారు, క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొనాలని కోరారు. కానీ ఆయన మాత్రం క్రియాశీలక రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. ఇటీవలనే జేసీ ప్రభాకర్ రెడ్డి రఘువీరారెడ్డితో భేటీ అయ్యారు.  ఈ సమయంలోకూడా రఘువీరారెడ్డి క్రియాశీలకంగా రాజకీయాల్లో వ్యవహరిస్తారనే ప్రచారం కూడా సాగిన విషయం తెలిసిందే.

click me!