జైల్లో వున్నంత మాత్రాన చంద్రబాబు దోషి కాదు .. జగన్ కూడా వెళ్లొచ్చారు, కోర్టే తేలుస్తుంది : ధర్మాన సంచలనం

Siva Kodati |  
Published : Oct 07, 2023, 04:50 PM IST
జైల్లో వున్నంత మాత్రాన చంద్రబాబు దోషి కాదు .. జగన్ కూడా వెళ్లొచ్చారు, కోర్టే తేలుస్తుంది : ధర్మాన సంచలనం

సారాంశం

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో జైల్లో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహారంపై స్పందించారు వైసీపీ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు . జైల్లో వున్నంత మాత్రాన చంద్రబాబును దోషి అనడం లేదని .. ముఖ్యమంత్రి జగన్ కూడా జైలుకి వెళ్లొచ్చారని ధర్మాన గుర్తుచేశారు. 

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో జైల్లో వున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యవహారంపై స్పందించారు వైసీపీ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు. శ్రీకాకుళంలో వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల సొమ్ము నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే వెళ్లడం వల్లే వైసీపీ కార్యకర్తలు దివాళా తీశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైల్లో వున్నంత మాత్రాన చంద్రబాబును దోషి అనడం లేదని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ కూడా జైలుకి వెళ్లొచ్చారని ధర్మాన గుర్తుచేశారు. చంద్రబాబు జైలుకు వెళ్లడంలో కక్ష సాధింపు చర్యలు లేవని.. ఆయన ముద్దాయా కాదా అనే విషయం కోర్టు తేలుస్తుందన్నారు. 

జర్మనీలో వున్న సీమెన్స్ సంస్థతో పేమెంట్ జరిగినట్లు నాటి ప్రభుత్వం చెబుతుందని.. దానిపై దర్యాప్తు సంస్థలు ప్రశ్నిస్తే అలాంటిదేమీ లేదని సదరు కంపెనీ తెలిపిందన్నారు. దేశంలోని కొన్ని కంపెనీలు పెట్టి, డబ్బులు పంపడానికి మాత్రమే సెల్ కంపెనీలను ఉపయోగిస్తున్నాయన్నారు. దర్యాప్తులో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం డబ్బులు ఇద్దరు వ్యక్తుల వద్దకే వెళ్లినట్లు తేలిందని ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిలో ఒకరు చంద్రబాబు పీఏ అయితే, మరొకరు లోకేష్ పీఏ అని మంత్రి ఆరోపించారు. 

ALso Read: అస‌త్యాలు ప్ర‌చారం చేస్తున్నారు.. చంద్ర‌బాబు, పవన్ ల పై పేర్ని నాని ఫైర్

మాజీ ముఖ్యమంత్రి, గౌరవనీయ వ్యక్తి అని చంద్రబాబును వదిలేయమంటే ఎలా అని ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు. ఇందిరా గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్, జయలలిత, పీవీ నరసింహారావు లాంటి నేతలే కోర్టు కేసులు ఎదుర్కొన్నారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని ధర్మాన కోరారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు.. ఈ నాలుగు జిల్లాల్లో అల్లకల్లోలమే
Varudu Kalyani: ఆవకాయ ఫెస్టివల్ కి డబ్బులుంటాయి.. ఆడబిడ్డ నిధికి డబ్బులుండవా? | Asianet News Telugu