ఒక్కో వైసీపీ ఎంపీ అభ్యర్థి ఖర్చు రూ.100కోట్లు, జై రమేష్ ని తరిమికొడతారు: దేవినేని ఉమ

By Nagaraju penumalaFirst Published 16, Feb 2019, 7:49 PM IST
Highlights

విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఒక్కో ఎంపీ అభ్యర్థి రూ.100కోట్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. అవినీతి డబ్బుతో గెలుపొందాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైసీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికకు లోటస్ పాండ్ మడుగు నుంచి ప్రారంభమైందని దేవినేని ఆరోపించారు. 

విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థులపై మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా వక్రమార్గాలు పడుతున్నారని ఆరోపించారు. 

విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన ఒక్కో ఎంపీ అభ్యర్థి రూ.100కోట్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. అవినీతి డబ్బుతో గెలుపొందాలని ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వైసీపీ ఎంపీ అభ్యర్థుల ఎంపికకు లోటస్ పాండ్ మడుగు నుంచి ప్రారంభమైందని దేవినేని ఆరోపించారు. 

ఈ సందర్భంగా దాసరి జై రమేష్ పై మండిపడ్డారు దేవినేని ఉమ. తెలుగుదేశం పార్టీలో 21 ఏళ్లు వ్యాపారాలు చూసుకున్న జై రమేష్ ఇప్పుడు టీడీపీపై నిందలు వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 నెలలు జైలులో కాపురం చేసిన జగన్‌ని జైరమేష్‌ నీతిమంతుడని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

హైదరాబాదులో వ్యాపారాలు చేసుకుంటూ తమపై రాళ్ళు వేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో జైరమేష్‌ ఎంతో లబ్దిపొందారని గుర్తు చేశారు. ఈ ఐదేళ్లు చంద్రబాబు దేవుడన్న జై రమేస్ కేంద్రం నుంచి సిగ్నల్ రాగానే రాక్షసుడు అయిపోయారా అంటూ విరుచుకుపడ్డారు. 

డబ్బు, అవినీతి రాజకీయాలు రాష్ట్రంలో కుదరవన్నారు. ಓటు అనే ఆయుధంతో అవినీతిపరుల్ని ప్రజలు తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్, కేటీఆర్ అండతోనే జగన్ పార్టీలోకి వలసలు: మంత్రి దేవినేని ఉమ

Last Updated 16, Feb 2019, 7:49 PM IST