కక్ష సాధించాలనుకుంటే ఇన్నాళ్లు వెయిట్ చేస్తామా : చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి చెల్లుబోయిన

Siva Kodati |  
Published : Sep 10, 2023, 02:55 PM IST
కక్ష సాధించాలనుకుంటే ఇన్నాళ్లు వెయిట్ చేస్తామా : చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి చెల్లుబోయిన

సారాంశం

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై స్పందించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.  చంద్రబాబుపై కక్ష సాధించాలనుకుంటే ఇన్నేళ్లు ఆగేవాళ్లం కాదని చెల్లుబోయిన స్పష్టం చేశారు.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై స్పందించారు మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..  చంద్రబాబు ఆదేశాలతోనే కుంభకోణం జరిగిందన్నారు. ఆ స్కాంలు పురందేశ్వరి, పవన్ కల్యాణ్‌లకు కనిపించడం లేదా అని వేణుగోపాల్ ప్రశ్నించారు. చేతికి వాచ్ లేదని చెప్పుకునే చంద్రబాబు.. కోట్ల రూపాయలు ఫీజులు చెల్లించి లాయర్లను ఎలా పెట్టుకున్నారని మంత్రి నిలదీశారు. 

అధికారుల సూచనలను బేఖాతరు చేస్తూ చంద్రబాబు స్కాం చేశారని.. ఇప్పుడు సింపతి కోసం ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కక్ష సాధించాల్సిన అవసరం వైసీపీ ప్రభుత్వానికి లేదని.. సీఐడీ విచారణలో అన్ని బయటకొస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఒకవేళ చంద్రబాబుపై కక్ష సాధించాలనుకుంటే ఇన్నేళ్లు ఆగేవాళ్లం కాదని చెల్లుబోయిన స్పష్టం చేశారు. కుట్రలతో గెలవాలని చూసేది తెలుగుదేశం పార్టీ అని జగన్ కాదన్నారు. చేసిన తప్పుకు చంద్రబాబు శిక్ష అనుభవించక తప్పదని.. ఇలాంటి ఎన్నో స్కాంలు ఆయన చేశారని మంత్రి ఆరోపించారు. 

ALso Read: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం .. తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదలం : అనిల్ కుమార్ యాదవ్

అంతకుముందు మంత్రి రోజా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిని ఆధారాలు లేకుండా అరెస్ట్ చేస్తారా? అని ప్రశ్నించారు. సాక్ష్యాధారాలు లేకపోతే కేసు నిలబడదని అన్నారు. కేసు నమోదు చేసిన తర్వాత విచారణలో చాలా  పేర్లు, వివరాలు బయటకు వస్తాయని అన్నారు. చంద్రబాబు మీద కక్ష సాధించాలంటే సీఎం జగన్ నాలుగేళ్లు ఆలోచించాల్సిన అవసరం లేదని అన్నారు. చంద్రబాబు తప్పు చేసి దొరికిపోయాడని.. అందుకే సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని అన్నారు.

చంద్రబాబు భార్య భువనేశ్వరికి సెన్స్ ఉందా? అని ప్రశ్నించారు. తప్పు చేసిన చంద్రబాబు కోసం ఆయన సతీమణి భువనేశ్వరి దేవుడిని వేడుకోవటం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్‌పై భువనేశ్వరి, బ్రాహ్మణికి ఎలాంటి బాధ లేదన్నారు. ఎన్టీఆర్‌ను పొట్టనబెట్టుకున్నప్పుడే ఆయన కూతుళ్లుకు, కుటుంబానికి బాధ లేదని విమర్శించారు. ఎన్టీఆర్ కుమార్తెలకు తన తండ్రిని హిసించినా ఎటువంటి ఎమోషన్స్ లేవని అన్నారు. నాడు ఎన్టీఆర్ ను వేధించిన వ్యక్తిని ఇప్పుడు విధి సమాధానం చెప్పిందని రోజా చెప్పుకొచ్చారు. ఈరోజు చంద్రబాబు అరెస్ట్‌తో ఎన్టీఆర్ ఆత్మ శాంతిస్తోందని అన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: తిరుపతి వెడ్డింగ్ హబ్ గా తయారవుతుంది | Wedding Hub | Asianet News Telugu
Chandrababu: స్వర్ణ నారావారిపల్లెకు శ్రీకారం చుట్టాం.. జీవనప్రమాణాలు పెంచాలి | Asianet News Telugu