అమిత్ షాను కలుస్తారు.. రేపు అమితాబ్‌తో భేటీ అవుతారు, మాకేంటీ : చంద్రబాబుపై బొత్స సెటైర్లు

Siva Kodati |  
Published : Jun 08, 2023, 07:32 PM IST
అమిత్ షాను కలుస్తారు.. రేపు అమితాబ్‌తో భేటీ అవుతారు, మాకేంటీ : చంద్రబాబుపై బొత్స సెటైర్లు

సారాంశం

చంద్రబాబు అమిత్ షాను కలిస్తే మాకేంటి, అమితాబ్‌ను కలిస్తే మాకేంటి అని సెటైర్లు వేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ప్రజలంతా జగన్‌వైపే వున్నారని బొత్స పేర్కొన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవడంపై సెటైర్లు వేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అమిత్ షాను కలిస్తే మాకేంటి, అమితాబ్‌ను కలిస్తే మాకేంటి అని బొత్స ప్రశ్నించారు. ఏపీలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరగుతాయని.. ముందస్తు అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవమని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం  కలిగిందని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. మేనిఫెస్టో ప్రకటించిన హామీల్లో 98 శాతం అమలు చేశామని.. ప్రజలంతా జగన్‌వైపే వున్నారని బొత్స పేర్కొన్నారు. జీపీఎస్ వల్ల ఉద్యోగులకి న్యాయం జరుగుతుందన్న ఆయన.. సీపీఎస్ రద్దును ఏ రాష్ట్రంలో చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. 

మరోవైపు.. జూన్ నెల మొదటివారం వచ్చేయడంతో దేశవ్యాప్తంగా పాఠశాలలు , విద్యా సంస్థలు తెరిచేందుకు ఆయా ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే కొన్ని చోట్లు ఉష్ణోగ్రతలు తగ్గకపోవడం, ఎండలు మండిపోవడంతో వేసవి సెలవులను పొడిగిస్తున్నారు. ఏపీలోనూ ప్రస్తుతం ఎండలు తీవ్రంగా వుండటంతో పిల్లలను స్కూళ్లకు పంపేందుకు తల్లిదండ్రులు భయపెడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్కూళ్ల పున : ప్రారంభంపై గందరగోళం నెలకొంది. దీంతో మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. 

ALso Read: మండుతున్న ఎండలు.. ఏపీలో స్కూళ్ల రీ ఓపెన్‌పై గందరగోళం : బొత్స స్పందన ఇదే

జూన్ 12 నుంచి ఏపీలో స్కూళ్లు ప్రారంభమవుతాయని, విద్యార్ధులకు అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం క్రోసూరులో సీఎం జగన్ చేతుల మీదుగా జగనన్న విద్యాకానుకను అందజేస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు. జూన్ 28న అమ్మఒడిని అందిస్తామని మంత్రి వెల్లడించారు. అలాగే 6వ తరగతి నుంచి 12 వరకు డిజిటల్ విద్యను ప్రారంభిస్తామని, ఈ నెల 12 నుంచి ప్రతీ స్కూల్‌లో స్మార్ట్ టీవీలను ఏర్పాటు చేస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 

PREV
click me!

Recommended Stories

Smart Kitchen Project for Schools | CM Appreciates Kadapa District Collector | Asianet News Telugu
Roop Kumar Yadav Serious Comments Anil Kumar Yadav | Nellore Political Heat | Asianet News Telugu