15 ఏళ్లుగా చూస్తూనే వున్నాం.. ఏం తేలుస్తారు, గొంగూర కట్ట: పవన్‌పై బొత్స సెటైర్లు

Siva Kodati |  
Published : Oct 01, 2021, 08:39 PM IST
15 ఏళ్లుగా చూస్తూనే వున్నాం.. ఏం తేలుస్తారు, గొంగూర కట్ట: పవన్‌పై బొత్స సెటైర్లు

సారాంశం

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ ఏం తేలుస్తారు.. గొంగూర కట్ట అంటూ మండిపడ్డారు. గత 15 ఏళ్ల నుంచి ఏం తేలుస్తున్నారో చూస్తూనే వున్నామని బొత్స వ్యంగ్యాస్త్రాలు సంధించారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు. పవన్ కల్యాణ్ ఏం తేలుస్తారు.. గొంగూర కట్ట అంటూ మండిపడ్డారు. గత 15 ఏళ్ల నుంచి ఏం తేలుస్తున్నారో చూస్తూనే వున్నామని బొత్స వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2009 నుంచి చొక్కాలు చింపుతా అంటున్నారని... ఇప్పటికి ఎన్ని చొక్కాలు చింపారని బొత్స ప్రశ్నించారు. 

మరోవైపు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుపైనా కామెంట్స్ చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఆయన స్నేహితుడిలాగే సోము వీర్రాజుకు కూడా ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువంటూ సెటైర్లు వేశారు. కేంద్రం నిధులు ఉపయోగించి  క్లాప్ కార్యక్రమాన్ని ప్రారంభించడం లేదని.. ప్రజల భాగస్వామ్యంతో వసూలైన డబ్బుతోనే క్లాప్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు బొత్స స్పష్టం చేశారు. కేంద్రం నిధులు వుంటే కచ్చితంగా ప్రస్తావిస్తామని సత్తిబాబు పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో యూజర్ ఛార్జీల కింద సుమారు రూ.350 కోట్లు వసూలైందని మంత్రి తెలిపారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్లాంట్లను పీపీపీ విధానంలో నిర్మిస్తున్నట్లు సత్యనారాయణ పేర్కొన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో చిన్నారితో బాబు సెటైర్లు | Asianet News Telugu
Chandrababu Power Full Speech: అనకాపల్లిలో స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమం| Asianet News Telugu