మహానాడు పేరుతో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు తన డబ్బా కొట్టుకుంటున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు.
అమరావతి: టిడిపి అధ్యక్షులు చంద్రబాబు రెండు నెలల తరువాత రాష్ట్రానికి వచ్చి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నాడని మంత్రి అనిల్ కుమార్ రాష్ట్రాన్ని ఎవరు మండిపడ్డారు. దివాళా తీశారు, అధిక పన్నులు వసూలు చేస్తున్నారంటూ ప్రభుత్వంపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అయితే చంద్రబాబు ఎప్పటికీ జిరోనే.. జగన్ ఎప్పటికి హీరోనే అని అనిల్ అన్నారు.
''చంద్రబాబు, లోకేష్ ని టెస్ట్ చెయ్యలేదని బాధపడుతున్నట్టు ఉన్నారు. కంగారుపడకండి మిమ్మల్ని కూడా టెస్ట్ చేయిస్తాం. ఎల్జీ పాలిమర్స్ విషయంలో జగన్ కు ఒకే లాయర్ ఉంటే తప్పేంటి. మంచి లాయర్ అయితే ఎవరైనా పెట్టుకుంటారు. లాయర్ విషయంలో కూడా చంద్రబాబు రాజకీయాలు చెయ్యడం సిగ్గిచేటు'' అని మండిపడ్డారు.
undefined
''రైతులపై 10,500 కోట్లు వరకూ సహాయం చేస్తే చంద్రబాబుకి ఏడుపు ఎందుకు..? ఐదేళ్లలో పోలవరంకు ఎంత ఖర్చు పెట్టారో లెక్కలు చెప్పే ధైర్యం మీకు ఉందా..? 75 శాతం పనులు పూర్తి చేశామని దొంగ లెక్కలు చెబుతున్నారు. వైస్సార్ ఈ ప్రాజెక్టు ప్రారంభించారు... జగన్ పూర్తి చేస్తారు'' అని స్పష్టం చేశారు.
read more గ్రామ సభలో పాల్గొనడానికి నేను సిద్దం... దాన్నికూడా నిరూపిస్తా: అచ్చెన్నాయుడు సవాల్
''చంద్రబాబు రాయలసీమకు నీరిస్తే రెండు సీట్లే ఎందుకొస్తాయి..? రాయలసీమ నీటి గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకి లేదు. ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచి చంపేసి సిగ్గులేకుండా మహానాడు అని జరుపుకుంటున్నారు'' అని మండిపడ్డారు.
''ఏడాదిలో మూడు కోట్ల 40 లక్షల మందికి 40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు సీఎం జగన్, వైసిపి ప్రభుత్వం అమలుచేశారు. చంద్రబాబు 14 ఏళ్ల పదవిలో ఉండి ఇంత సంక్షేమ పథకాలు అమలు చేసారా..?వ్యవస్థలను మ్యానేజ్ చేసుకుంటూ బ్రతికే చంద్రబాబు రాజ్యాంగం గురించి మాట్లాడటం సిగ్గుచేటు. టీడీపీలో ఉన్న దొంగలు, రౌడీలు ఎక్కడా లేరు. ఎమ్మెల్యేలు జారిపోతున్నారని భయంతో చంద్రబాబు డప్పు కొట్టుకోవడానికి మహానాడు పెట్టారు'' అని అనిల్ యాదవ్ మండిపడ్డారు.