గ్రామ సభలో పాల్గొనడానికి నేను సిద్దం... దాన్నికూడా నిరూపిస్తా: అచ్చెన్నాయుడు సవాల్

By Arun Kumar P  |  First Published May 28, 2020, 7:43 PM IST

తెలుగుదేశం అంటే బీసీలు, బీసీలంటే తెలుగుదేశమని... తెలుగుదేశం ఏర్పడిన తరువాతే రాష్ట్రంలో సంక్షేమం పుట్టిందని మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 


గుంటూరు: తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు బలహీన వర్గాలు, హరిజనులు, గిరిజనులు, మైనార్టీలు ఎంత వెనకబడి ఉండేవారే గుర్తు పెట్టుకోవాలని కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగుదేశం అంటే బీసీలు, బీసీలంటే తెలుగుదేశమని... తెలుగుదేశం ఏర్పడిన తరువాతే రాష్ట్రంలో సంక్షేమం పుట్టిందన్నారు. బీసీలు  ఆర్దికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చెందారంటే దానికి కారణం ఎన్టీఆర్, చంద్రబాబు మాత్రమేనని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. 

''తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎనలేని సేవలు, కార్యక్రమాలు, పథకాలు చేపట్టి వారిని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో ముందుంచింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 37 శాతం రిజర్వేషన్ పెట్టింది చంద్రబాబు మాత్రమే.  జగన్ బీసీల మీద కక్షగట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం నుంచి  24 శాతానికి రిజర్వేషన్లు తగ్గించి ఉక్కుపాదం మోపుతున్నారు'' అన్నారు. 

Latest Videos

undefined

''మంత్రులు అధికారంలోకి ఉండటానికి అవకాశం లేదు. బీసీలకు అన్యాయం జరుగుతుంటే మంత్రులు ఒక్కమాట మాట్లాడటంలేదు. బీసీలకు 70  రెసిడెన్సియల్స్ పాఠశాలలు, 15 రెసిడెన్సియల్ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు మాత్రమే.  వైఎస్‌, కాంగ్రెస్‌ పదేళ్ల పానలో బీసీ సంక్షేమం కోసం 23 జిల్లల ఆంధ్రప్రదేశ్‌లో రూ.3000 కోట్లు ఖర్చు చేస్తే.. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 13 జిల్లా రాష్ట్రంలో రూ.41వే కోట్లు వ్యయం చేశాం'' అని వెల్లడించారు. 

read more  నా వల్లే తెలంగాణ భారీ ఆదాయం... అమరావతినీ అలా చేయాలనుకున్నా:మహానాడులో చంద్రబాబు

''ఫీజ్ రీయంబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ బీసీ విద్యార్ధులకు అందించాం. విదేశీ విద్య పథకం ద్వారా బీసీ విద్యార్ధులను  విదేశాల్లో చదివించాం. ఎన్టీఆర్ ఫెడరేషన్స్ పెట్టి నిధులు అందించారు. వీటిని వైఎస్  నిర్వీర్యం చేశారు. చంద్రబాబు ప్రతి కులాలనికి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు.  36 కులాలకు మోస్ట్ బ్యాక్ వర్డ్ కర్పొరేషన్ పెట్టి ఆదుకున్నాం.
 బీసీలకు సబ్ ప్లాన్ పెట్టాం. కానీ ఏడాది కాలంలో బీసీలకు జగన్ ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు'' అని తెలిపారు. 

''13 జిల్లాల్లో ఏ గ్రామ పంచాయితీ గ్రామ సభ లో అయినా పాల్గొనడానికి నేను సిద్దమే. ఈ ఏడాదిలో ఆ ప్రాంతంలో వైసీపీ కార్యకర్తలకు మినహా మరెవ్వరికి పథకాలు అందించలేదని నిరూపిస్తాను. లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా'' అని సవాల్ విసిరారు. 

''గతంలో కాపు రిజర్వేషన్ గురించి పోరాడిన నాయకులు ఏడాది నుంచి ఎక్కడికి పోయారు? కాపులకు 5శాతం రిజర్వేషన్‌ కల్పించి బీసీ ఎఫ్‌ కేటగిరీలో చేర్చింది తెలుగుదేశం పార్టీనే.  పార్టీ ప్రారంభం నుంచి మనకు అండగా ఉన్న కొన్ని బీసీ వర్గాలు దూరమ్యాయి. వారందరిని మళ్లీ దగ్గరకు చేర్చుకోవాలి. జగన్ బీసీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. యలను ఎస్సీల్లో చేర్చమని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తే జగన్ ఇంత వరకు దాని మీద దృష్టి పెట్టలేదు''  అని  అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. 

click me!