
కడప: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి నిప్పులు చెరిగారు. జగన్మోహన్ రెడ్డికి సీఎం కావాలనే యావ తప్ప అభివృద్ధి ద్యాసే లేదన్నారు. పాదయాత్రలో అన్ని చేస్తా అంటున్న జగన్..కేరళ ముఖ్యమంత్రిగా పంపితే వరదలను ఆపేవాడేమోనని చమత్కరించారు. జగన్ ను కొద్దిరోజులపాటు కేరళ సీఎంగా పంపితే వరదలను నివారించడంతో పాటు 20వేల కోట్లు నష్టాన్ని తప్పించేడేమోనని వ్యంగ్యంగా విమర్శించారు.
వైఎస్ జగన్ మన జిల్లాలో పుట్టడం దురదృష్టకరమని....మన దౌర్భాగ్యం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగ మాటలు చెప్పే జగన్ ను నమ్మవద్దని జిల్లా అభివృద్ధికి పాటుపడుతున్న చంద్రబాబునాయుడును నమ్మాలని సూచించారు. తెలుగుదేశం ప్రభుత్వం కడప జిల్లా కల్చర్ ను మారుస్తుందని తెలిపారు. అలాగే ఫ్యాక్షన్ లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు.