స్వస్థలాలకు వెళ్లడానికి అనుమతి... ఈ మార్గదర్శకాలకు లోబడి మాత్రమే: ఏపి సర్కార్ ఉత్తర్వులు

Arun Kumar P   | Asianet News
Published : May 02, 2020, 12:56 PM ISTUpdated : May 02, 2020, 01:00 PM IST
స్వస్థలాలకు వెళ్లడానికి అనుమతి... ఈ మార్గదర్శకాలకు లోబడి మాత్రమే: ఏపి సర్కార్ ఉత్తర్వులు

సారాంశం

లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో, వేరు వేరు జిల్లాల్లో చిక్కుకున్న వారిని వారి స్వస్థలాలకు తరలించే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది జగన్ ప్రభుత్వం. 

అమరావతి: కేంద్ర  ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా లాక్ డౌన్ కారణంగా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఆంధ్ర ప్రదేశ్ వాసులు, రాష్ట్రంలో చిక్కుకున్న ఇతర  రాష్ట్రవాసులు, జిల్లాల్లో చిక్కుకున్న వలస కార్మికులను స్వస్థలాలకు తరలించే దిశగా ఏపి సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను కూడా జగన్ ప్రభుత్వం జారీచేసింది. 

రాష్ట్రంలో, ఇతర జిల్లాలలో చిక్కుకున్న వలస కార్మికులు సహాయం కోసం 1902 కి ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. అయితే కేవలం గ్రీన్ జోన్ నుండి గ్రీన్ జోన్ లకు వెళ్లడానికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 

ప్రభుత్వం ఏర్పాటుచేసిన రిలీఫ్ క్యాంప్ లో నుండి స్వగ్రామాలకు వెళ్లాలి అనుకునే వాళ్ళకు రాండమ్ గా పరీక్షలు నిర్వహించనున్నట్లు... కోవిడ్ పరీక్షల్లో నెగటివ్ వచ్చినవారిని మాత్రమే బస్సులో 50 శాతంకు మించకుండా తరలించాలని ఆదేశించింది. ఇలా స్వస్థలాలకు చేరుకున్న వారిని సైతం మరోసారి 14 రోజుల క్వారంటైన్, అనంతరం మరో 14 రోజులు హోం క్వారంటైన్ విధించనున్నారు. ఇందులో ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్టు గుర్తిస్తే ఆ గ్రూపు మొత్తాన్ని అక్కడే ఉంచాల్సిందిగా సంబంధిత అధికారులకు సూచించింది. 

కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రి తీసుకెళ్లాలని ఆదేశించింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి గురించి ఆ రాష్ట్రాల అధికారులతో సమన్వయం చేసుకోవాల్సిందిగా సూచించారు. ఇలాంటివారిని తరలించడానికి ప్రతి జిల్లాలో ఒక బస్టాండ్, రైల్వే స్టేషన్ గుర్తించాలని ఆదేశించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు ఆ జిల్లా యంత్రాంగం అనుమతి ఇచ్చిన రైల్వే స్టేషన్, బస్టాండ్ చేరుకునేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఇలా వచ్చిన వారికి స్క్రీనింగ్ తో సహా, పూల్ పద్ధతిలో కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. 

ఇతర రాష్ట్రాల్లో రెడ్ జోన్, కంటెన్మెంట్ జోన్ నుండి వచ్చే వారిని ప్రత్యేకంగా గుర్తించాలని సూచించిన ప్రభుత్వం ఆ ప్రాంతాల నుంచి వచ్చిన వారిని వెంటనే 14 రోజుల క్వారంటెన్ కు పంపిచాలని ఆదేశించింది. పరీక్షల అనంతరమే వారిని బయటకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోవిడ్19 స్టేట్ నోడల్ ఆఫీసర్ నుండి మార్గదర్శకాలు విడుదలయ్యాయి. 

PREV
click me!

Recommended Stories

Ramzan Holidays : మారిన రంజాన్ సెలవులు.. ఒకటి కాదు రెండ్రోజులు హాలిడేసే
ఇన్నిరోజులకి ఇద్దరిని చూశా ఇవి తినని వాళ్ళని: AP State Food Commission Shock | Asianet News Telugu