పోలీసులకు వీక్లీఆఫ్‌, మహిళల జోలికోస్తే కఠినచర్యలు: సుచరిత

By Siva KodatiFirst Published Jun 16, 2019, 12:34 PM IST
Highlights

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత. ఆదివారం ఆమె హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి మేకతోటి సుచరిత. ఆదివారం ఆమె హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అమరావతి సచివాలయంలోని 2వ బ్లాక్‌లోని చాంబర్‌లో సుచరిత ప్రత్యేక పూజలు నిర్వర్తించారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ.. దళిత మహిళకు హోంమంత్రి బాధ్యతలు అప్పగించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నేరం చేయాలంటేనే భయపడేలా కఠిన చట్టాలు తీసుకొస్తామని ఆమె హెచ్చరించారు.

ర్యాగింగ్, వేధింపులను సమూలంగా నిర్మూలిస్తామని, మహిళలు నిర్భయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసే పరిస్థితి కల్పిస్తామని సుచరిత వెల్లడించారు. మహిళల భద్రతకు ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని, పోలీసులకు వీక్లీ ఆఫ్‌లు అమలు, కొత్తగా 4 బెటాలియన్లు ఏర్పాటు చేస్తామని హోంమంత్రి వెల్లడించారు.

ఇది కోవలో మహిళా బెటాలియన్, గిరిజన బెటాలియన్ ఏర్పాటు చేస్తామన్నారు. మహిళా కానిస్టేబుళ్లు సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని.. వాళ్ల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని సుచరిత పేర్కొన్నారు.

click me!
Last Updated Jun 16, 2019, 12:35 PM IST
click me!