టీడీపీకి ఓటేసినందుకు ఐదేళ్ల గ్రామ బహిష్కరణ

By Siva KodatiFirst Published Jun 16, 2019, 10:26 AM IST
Highlights

టీడీపీకి ఓటేసినందుకు ఐదేళ్ల పాటు ఊళ్లోకి రాకూడదంటూ వైసీపీ నేతలు తమను బెదిరిస్తున్నారంటూ గుంటూరు జిల్లాకు చెందిన గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీపై వైసీపీ నేతల కక్ష సాధింపు చర్యలు తీవ్రతరమవుతున్నాయి. ఇప్పటికే ఇరువర్గాలు దాడులకు దిగుతున్నాయి. తాజాగా టీడీపీకి ఓటేసినందుకు ఐదేళ్ల పాటు ఊళ్లోకి రాకూడదంటూ వైసీపీ నేతలు తమను బెదిరిస్తున్నారంటూ గుంటూరు జిల్లాకు చెందిన గ్రామస్తులు పోలీసులను ఆశ్రయించారు.

వివరాల్లోకి వెళితే.. మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో కొందరు ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీకి ఓటేశారు. అయితే అలా వేసినందుకు వైసీపీ నాయకులు వారిని రాళ్లు, కర్రలతో కొట్టి.. ఊరిలో ఉండవద్దంటూ బెదిరించి వెళ్లగొట్టారు.

దాడులు భరించలేదక వీరిలో 70 కుటుంబాల వారు గ్రామాన్ని విడిచిపెట్టి పొరుగున ఉన్న గామాలపాడులో తలదాచుకున్నారు. ఈ క్రమంలో వారు శనివారం జిల్లా ఎస్పీ జయలక్ష్మీకి ఫిర్యాదు చేశారు.

వ్యవసాయమే తమకు జీవనాధారమని, పొలాల్లోకి వెళుతుంటే మరో ఐదేళ్ల వరకు గ్రామంలోకి రాకూడదని.. ఎదరించి వస్తే చంపుతామని బెదిరిస్తున్నారని తెలిపారు. వీరిలో కొందరు రౌడీషీటర్లు చేరి గ్రామంలోని 20 మందిపై దాడి చేశారని తెలిపారు.

పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారిపై కేసులు నమోదు చేయడం లేదని వాపోయారు. దాదాపు 200 కుటుంబాలు ఇలా ఇబ్బందులు పడుతున్నట్లు ప్రస్తావించారు. తక్షణం తమకు రక్షణ కల్పించాలని కోరుతూ... తమపై దాడులు చేస్తున్న 26 మంది పేర్లు, వివరాలు అందజేశారు.

click me!