వైసీపీలోనే ఉంటా, ఎంపీగా పోటీ చేస్తా: మాజీ ఎంపీ మేకపాటి

By Nagaraju TFirst Published Jan 31, 2019, 4:20 PM IST
Highlights

గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మేకపాటి నైతిక విలువలతో వార్తలు రాయాలే తప్ప తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే వారికి విలువలు ఉండవని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి తాను వైఎస్‌ జగన్‌తో కలిసి పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. 

ఢిల్లీ : పార్టీ వీడుతున్నారంటూ వస్తున్న వార్తలపై వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీని వీడుతున్నట్టు దుష్ప్రచారం జరుగుతుందంటూ మండిపడ్డారు. 

గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన మేకపాటి నైతిక విలువలతో వార్తలు రాయాలే తప్ప తప్పుడు వార్తలు ప్రసారం చేస్తే వారికి విలువలు ఉండవని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి తాను వైఎస్‌ జగన్‌తో కలిసి పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. 

పార్టీ ఆదేశాల మేరకు ఎంపీ పదవికి రాజీనామా చేశానని తెలిపారు. విభజన చట్టంలోని హామీలను సాధించకపోతే చంద్రబాబుకు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. ఎన్నికలు వస్తున్నాయనే పెన్షన్లు పెంచుతున్నారని దుయ్యబుట్టారు. 

ప్రజల్ని మభ్యపెట్టేలా చంద్రబాబు హామీలు ఇస్తున్నారని బాబు నిజస్వరూపం ప్రజలందరికీ తెలుసునన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బాబుకు తగిన గుణపాఠం చెప్తారని ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం ఏపీకి తీరని అన్యాయం చేసిందన్నారు. బాబు మోసం, వంచనతో ప్రజలు విసిగిపోయారని చెప్పుకొచ్చారు. 

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించిన నవరత్నాలను బాబు కాపీ కొడుతున్నారని అందులో పథకాలే చంద్రబాబు అమలు చేస్తున్నారని మాజీఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 

click me!