గుంటూరులో ప్రేమోన్మాది ఘాతుకం.. వైద్యవిద్యార్థిని గొంతుకోసి హత్య, తానూ చేయి కోసుకుని..

Published : Dec 06, 2022, 07:03 AM IST
గుంటూరులో ప్రేమోన్మాది ఘాతుకం.. వైద్యవిద్యార్థిని గొంతుకోసి హత్య, తానూ చేయి కోసుకుని..

సారాంశం

గుంటూరులో దారుణం జరిగింది. ఓ వైద్యవిద్యార్థినిని ఆమె ప్రియుడు అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆ తరువాత తానూ చేయి కోసుకున్నాడు. 

గుంటూరు : గుంటూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేమోన్మాది  వైద్యఓ ప్రేమోన్మాది వైద్య విద్యార్థినిపై దాడిచేశాడు. ప్రియురాలు మాట్లాడటం లేదని  ఆమె మీద సర్జికల్ బ్లేడ్ తో దాడికి పాల్పడ్డాడు. ఆమె మీద సర్జికల్ బ్లేడ్ తో దాడికి పాల్పడ్డాడు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ దారుణ ఘటన గుంటూరు పెదకాకాని మండలం తక్కెళ్ళపాడులో చోటుచేసుకుంది. తసప్వి అనే అమ్మాయి బీడీఎస్ విద్యార్థిని. ఈమే జ్ఞానేశ్వర్ అనే యువకుడిని ప్రేమించింది. వీరిద్దరి మధ్య ఏం గొడవలు వచ్చాయో.. కానీ.. జ్ఞానేశ్వర్ తపస్విని గాయపరిచిన అనంతరం తానూ చేయి కోసుకున్నాడు.

అతడిని పట్టుకున్న స్థానికులు పెదకాకాని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..  నిందితుడు విజయవాడకు చెందినవ్యక్తి. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు.    తపస్వి బీడీఎస్ చదువుతోంది. వీరిద్దరికీ రెండేళ్ల క్రితం పరిచయమయ్యింది.  కొద్ది రోజులకు అది ప్రేమగా మారింది. ఇటీవల గత కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. తక్కెళ్లపాడులోని ఓ డెంటల్ కాలేజీలో చదువుతున్న తపస్వి స్నేహితురాలు ఒకరు విషయం తెలిసి వీరికి రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించింది.

అటెండర్ కంటే హీనంగా చూస్తున్నారు: కలెక్టర్‌ ముందు ఏడ్చిన జనగామ మున్సిపల్ కమిషనర్ రజిత

దీని కోసం వీరిద్దరినీ తన దగ్గరికి పిలిపించింది. ఈ క్రమంలో తపస్వి వారం రోజులుగా ఆమె వద్దే ఉంటోంది. ఎంత చెబుతున్నా ఇద్దరి మధ్య రాజీ కుదరకపోవడం.. తపస్వి ఒప్పుకోకపోవడంతో జ్ఞానేశ్వర్ తీవ్ర ఆ గ్రహానికి వచ్చాడు. తపస్విని హతమార్చాలని ప్లాన్ వేసుకున్నాడు. సోమవారంనాడు కూడా  ఆ స్నేహితురాలు వీరిద్దరి మధ్య గొడవలు  సరిదిద్ది రాజీ కుదిర్చేందుకు..  ప్రయత్నం చేసింది. ఆ సమయంలో జ్ఞానేశ్వర్  విపరీతమైన కోపంతో సర్జికల్ బ్లేడ్ తో తపస్విపై దాడికి తెగబడ్డాడు.  ఆమె గొంతు కోశాడు. 

అనుకోని ఈ పరిణామానికి ఆమె స్నేహితురాలు తీవ్రంగా భయపడింది గట్టిగా కేకలు వేస్తూ బయటికి వెళ్ళింది దీంతో స్థానికులు ఏం జరిగింది అంటూ వచ్చారు. జ్ఞానేశ్వరి వెంటనే గది తలుపులు మూసేశాడు. కొన ఊపిరితో ఉన్న తపస్విని ఒక గది నుంచి మరొగదిలోకి దారుణంగా ఈడ్చుకు వెళ్ళాడు. ఆ తర్వాత తాను చేయి కోసుకున్నాడు. తలపులు తెరవకపోవడంతో.. స్థానికులు తలుపులు పగలగొట్టారు. తపస్విని రక్షించి 108 వాహనంలో స్థానిక ఆసుపత్రికి తరలించారు.  అక్కడ ఆమె చికిత్స పొందుతూ, తీవ్ర గాయాల వల్ల మృతిచెందింది. నిందితుడిని పారిపోనీకుండా పట్టుకొని పోలీసులకు అప్పగించారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: హీరో మోటార్స్ విస్తరణ సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu
బొజ్జల సుధీర్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | Bojjala Sudheer Reddy Powerful Speech | Asianet Telugu