మంగళగిరి : ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీల్ వైద్య విద్యార్ధి ఆత్మహత్య.. అదనపు ఫీజు కోసం వేధింపులతోనే..?

Siva Kodati |  
Published : Aug 16, 2023, 05:09 PM ISTUpdated : Aug 16, 2023, 05:11 PM IST
మంగళగిరి : ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీల్ వైద్య విద్యార్ధి ఆత్మహత్య.. అదనపు ఫీజు కోసం వేధింపులతోనే..?

సారాంశం

గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఓ వైద్య విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదనపు ఫీజు కోసం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఎంవీ రావు వేధింపులతోనే అతను బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. 

గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలో ఓ వైద్య విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని యశ్వంత్‌గా గుర్తించారు. కాలేజ్ యాజమాన్యం ఒత్తిళ్లతోనే ఇతను బలవన్మరణానికి పాల్పడినట్లుగా తోటి విద్యార్ధులు చెబుతున్నారు. అదనపు ఫీజు కోసం అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఎంవీ రావు వేధింపులకు గురిచేసినట్లుగా తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులకు కూడా ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన యశ్వంత్ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. ఈ మేరకు తెలుగు వార్తా సంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. 
 

PREV
click me!

Recommended Stories

వొళ్ళు గగురు పుట్టే విన్యాసాలతో అదరగొట్టిన పోలీస్ సిబ్బంది | Nara Lokesh | Independence Day | Stunts
ఈ బైకర్ విన్యాసాలకి మంత్రి నారా లోకేష్ ఫిదా | Nara Lokesh Particepate Independence Day Celebrations