డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసుపై సీబీఐ విచారణ: తీర్పు రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు

By narsimha lode  |  First Published Aug 16, 2023, 3:21 PM IST

డ్రైవర్ సుబ్రమణ్యం హత్యకేసు విచారణను సీబీఐకి అప్పగించాలని దాఖలు చేసిన పిటిషన్ పై  తీర్పును  రిజర్వ్ చేసింది  ఏపీ హైకోర్టు


అమరావతి:డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని దాఖలైన పిటిషన్ పై తీర్పును  రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు.2022 మే  19వ తేదీన అనుమానాస్పదస్థితిలో  డ్రైవర్ సుబ్రమణ్యం మృతి చెందాడు. ఈ డెడ్ బాడీని  ఎమ్మెల్సీ అనంతబాబు  వారి ఇంటి వద్ద కారులో తీసుకెళ్లి వదిలాడు. ఎమ్మెల్సీ అనంతబాబే  డ్రైవర్ సుబ్రమణ్యాన్ని హత్య చేశాడని పేరేంట్స్,  దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి.   ఈ కేసులో  అనంతబాబును 2022 మే 23న  పోలీసులు అరెస్ట్  చేశారు.డ్రైవర్ సుబ్రమణ్యానిది హత్యేనని  పోస్టుమార్టం నివేదిక కూడ తేల్చిందని అప్పట్లోనే పోలీసులు ప్రకటించారు.ఈ కేసులో అరెస్టైన  అనంత బాబు బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే  ఈ హత్య కేసును స్థానిక పోలీసుల విచారణపై  డ్రైవర్ సుబ్రమణ్యం పేరేంట్స్ మొదటి నుండి అసంతృప్తితోనే  ఉన్నారు.  ఎమ్మెల్సీకి అనుకూంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని  వారు  గతంలో ఆరోపణలు చేశారు. అయితే  ఈ కేసును సీబీఐతో విచారణ చేయించాలని  ఏపీ హైకోర్టులో  డ్రైవర్ సుబ్రమణ్యం పేరేంట్స్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై  ఏపీ హైకోర్టు  బుధవారంనాడు విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా  ప్రభుత్వ తరపు న్యాయవాదికి  హైకోర్టు పలు ప్రశ్నలు వేసింది. సీసీపుటేజీలో ఉన్న వారిని నిందితులుగా ఎందుకు చేర్చలేదని హైకోర్టు ప్రశ్నించింది. కేవలం అనంతబాబునే ఎందుకు  నిందితులుగా చేర్చారని హైకోర్టు అడిగింది. 

Latest Videos

undefined

also read:డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసు : సీబీఐకిఅప్పగింతపై కౌంటర్ దాఖలుకు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈ కేసును లోతుగా విచారించలేదని పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్  హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ఈ కేసు వివరాలను  ప్రభుత్వం సీల్డ్ కవర్ లో  హైకోర్టుకు అందించింది. ఇరు వర్గాల వాదనలను విన్న ఏపీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టుగా ఇవాళ ప్రకటించింది. డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో  అనంతబాబు ను అరెస్ట్ చేయడంతో ఆయనను వైఎస్ఆర్‌సీపీ నుండి ఆ పార్టీ  సస్పెండ్  చేసిన విషయం తెలిసిందే.

 

click me!