భర్తతో విభేదించి మరో వ్యక్తితో సహజీవనం.. చివరకు ఆ వివాహిత ఏం చేసిందంటే?

Published : Aug 13, 2023, 06:08 AM IST
భర్తతో విభేదించి మరో వ్యక్తితో సహజీవనం.. చివరకు ఆ వివాహిత ఏం చేసిందంటే?

సారాంశం

భర్తతో విభేదించి ఓ మహిళ మరో వ్యక్తితో సహజీవనం మొదలు పెట్టింది. కానీ, ఆ వ్యక్తితోనూ ఆమెకు తీవ్రంగా గొడవలు జరిగాయి. దీంతో ఇంటిలోనే ఉరివేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఏపీలోని నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.  

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ వివాహిత తన భర్తతో విభేదించి మరో వ్యక్తితో సహజీవనం మొదలు పెట్టింది. కొన్నాళ్లకు ఆ వ్యతితోనూ ఆమెకు గొడవలు ప్రారంభమయ్యాయి. ఓ సారి ఇలాగే గొడవపడ్డాక ఆ వ్యక్తి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఆ వెంటనే ఆమె డోరు క్లోజ్ చేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ముత్తుకూరు బీసీ కాలనీలో చోటుచేసుకుంది.

పంటపాళెం పంచాయతీలోని కోళ్లమిట్టకు చెందిన నాసిన శ్రీలేఖ తన భర్తతో విభేదించింది. ముత్తుకూరు బీసీ కాలనీలోని నివాసం ఉన్నది. కొన్నాళ్లకు ఆమె దుర్గప్రసాద్ అనే వ్యక్తితో సహజీవనం ప్రారంభించింది.

కానీ, వీరి మధ్య కూడా గొడవలు మొదలయ్యాయి. బుధవారం ఉదయం వీరి మధ్య తీవ్రంగా గొడవ జరిగింది. దీంతో అసహనంతో దుర్గ ప్రసాద్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. దుర్గ ప్రసాద్ బయటకు వెళ్లగానే శ్రీలేఖ ఇంటిలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దుర్గ ప్రసాద్ ఎంత సేపు బయటకు వెళ్లలేడు. స్వల్ప సమయంలోనే తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఇంటి తలుపు వేసి ఉండటం చూశాడు. కేకలు వేసి తలుపులు తెరవాల్సిందిగా కోరాడు. కానీ, ఏ చప్పుడు వినిపించలేదు. దీంతో ఇరుగుపొరుగు వారి సహాయంతో ఆ తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లాడు. లోపల ఫ్యాన్‌కు కట్టిన ఉరి తాడుకు శ్రీలేఖ వేలాడుతూ కనిపించింది.

Also Read: గుడివాడలో మహిళా వాలంటీర్ ఆత్మహత్య యత్నం.. మరో వాలంటీర్‌పై ఆరోపణలు..!

ఈ విషయం పోలీసులకు చేరింది. పోలీసులు వెంటనే స్పాట్‌కు వచ్చారు. మృతదేహాన్ని కిందికి దింపారు. పోస్టుమార్టం కోసం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Perni Nani comments on Chandrababu: చంద్రబాబు, పవన్ పేర్ని నాని సెటైర్లు | Asianet News Telugu
IMD Cold Wave Alert : ఈ సీజన్ లోనే కోల్డెస్ట్ 48 గంటలు.. ఈ ప్రాంతాల్లో చలిగాలుల అల్లకల్లోలమే