ప్రేమ పెళ్లి.. భార్యను నదిలోకి తోసేసిన భర్త

Published : Sep 22, 2020, 09:42 AM IST
ప్రేమ పెళ్లి.. భార్యను నదిలోకి తోసేసిన భర్త

సారాంశం

కొంతకాలం పాటు వీరి కాపురం సజావుగా సాగింది. తర్వాత ఇద్దరి మధ్యా మనస్పర్థలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలో భాస్కర్.. తన భార్య రామలక్ష్మిని అడ్డుతొలగించుకోవాలని భావించాడు.

వారిద్దరూ ఒకరినొకరు ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకున్నారు. కొంతకాలంపాటు వారి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత మనస్పర్థలు రావడం మొదలయ్యాయి.ఈ క్రమంలో.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను భర్తే అతి కిరాతకంగా హత్య చేయాలని అనుకన్నాడు.. నదిలోకి తోసేసి మరీ హత్య చేయాలని భావించాడు. ఈ క్రమంలో ఆమెను నదిలోకి తోసేశాడు. ఈ దారుణ సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఆళ్లగడ్డ మండలం మర్రిపల్లెకు చెందిన లక్ష్మీనరసయ్య , పుల్లమ్మ కుమారుడు పత్తి భాస్కర్ హైదరాబాద్ లోని ఇంటెలిజెన్స్ విభాగంలో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్నాడు. అదే నగరంలో రామలక్ష్మి అనే యువతి బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. కాగా.. వీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. 2016లో వీరిద్దరూ పెళ్లి ద్వారా ఒక్కటయ్యారు.

కొంతకాలం పాటు వీరి కాపురం సజావుగా సాగింది. తర్వాత ఇద్దరి మధ్యా మనస్పర్థలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలో భాస్కర్.. తన భార్య రామలక్ష్మిని అడ్డుతొలగించుకోవాలని భావించాడు. ఇందులో భాగంగా  ఈ నెల 16న భార్యను తీసుకుని స్వగ్రామం వచ్చాడు. సోమవారం ఉదయం కోవెలకుంట్ల మండలం గుళ్లదూర్తిలో ఉన్న బంధువుల ఇంటికి వెళదామంటూ ఆమెను తీసుకుని బైక్‌పై బయలుదేరాడు.

 గ్రామ సమీపంలోని కుందూనది వంతెనపైకి చేరుకున్న తర్వాత బైక్‌ ఆపాడు. సెల్ఫీ తీసుకుంటున్నట్లు నాటకమాడి భార్యను ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలోకి తోసేశాడు. దీన్ని ప్రమాదంగా చిత్రీకరించేందుకు తను కూడా బైక్‌తో సహా నదిలోకి దూకాడు. అతనికి ఈత రావడంతో కొంతదూరం తర్వాత ఒడ్డుకు చేరుకున్నాడు. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో  రామలక్ష్మి కేకలు వేస్తూ సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం కొట్టుకుపోయింది.

గమనించిన రైతులు నదిలోకి దూకి ఆమెను రక్షించారు. తర్వాత చికిత్స నిమిత్తం ఉయ్యాలవాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పీహెచ్‌సీకి చేరుకుని వివరాలు ఆరా తీయగా కసాయి భర్త భాగోతం బయటపడింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భాస్కర్‌పై  హత్యాయత్నంతో పాటు  498ఏ, 201 రెడ్‌విత్‌ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.   
 

PREV
click me!

Recommended Stories

లోకేష్ ని ఆటపట్టిస్తున్న పిల్లలు | Nara Lokesh | Asianet News Telugu
😂 Student Hilarious Reply To Nara Lokesh |లోకేష్ కే పంచు వేసిన బుడ్డోడు | Asianet News Telugu