రూ.50 లక్షల జరిమానా..బెజవాడలో ప్రాణం తీసిన జీఎస్టీ

sivanagaprasad kodati |  
Published : Oct 16, 2018, 08:58 AM IST
రూ.50 లక్షల జరిమానా..బెజవాడలో ప్రాణం తీసిన జీఎస్టీ

సారాంశం

కేంద్రప్రభుత్వానికి విపరీతంగా ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న జీఎస్టీ సామాన్యులపై పెనుభారం మోపుతోంది. అలాగే చిన్నా చితకా వ్యాపారుల జీఎస్టీ అమలు చేయని పక్షంలో భారీగా జరిమానాలు విధిస్తున్నారు అధికారులు. తాజాగా జీఎస్టీ కారణంగా ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

కేంద్రప్రభుత్వానికి విపరీతంగా ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న జీఎస్టీ సామాన్యులపై పెనుభారం మోపుతోంది. అలాగే చిన్నా చితకా వ్యాపారుల జీఎస్టీ అమలు చేయని పక్షంలో భారీగా జరిమానాలు విధిస్తున్నారు అధికారులు.

తాజాగా జీఎస్టీ కారణంగా ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అధికారుల వేధింపులు భరించలేక విజయవాడలో సాధిక్ అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నగరంలోని జవహర్ ఆటోనగర్‌లో లారీలకు బాడీ బిల్డింగ్ చేస్తోన్న సాదిక్‌కు జీఎస్టీ అధికారులు రూ.50 లక్షల జరిమానా విధించారు.

అయితే జరిమానా విషయంలో అధికారుల నుంచి రోజు రోజుకి ఒత్తిడి ఎక్కువ కావడంతో సాదిక్ తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. ఈ క్రమంలో ఇవాళ తెల్లవారుజామున స్థానిక బందర్ కాల్వలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్
Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి