విద్యార్థుల ముందే హెడ్మాస్టర్ చెంప చెళ్లు.. ఎందుకంటే...

Published : Feb 06, 2021, 01:25 PM IST
విద్యార్థుల ముందే హెడ్మాస్టర్ చెంప చెళ్లు.. ఎందుకంటే...

సారాంశం

నూజివీడు మండలం అన్నవరం ఎంపియుపి స్కూల్ లో దారుణం జరిగింది. విద్యార్థులు చూస్తుండగానే హెడ్ మాస్టర్ రాజును స్థానిక వ్యక్తి కటారపు జోజి చెంపమీద కొట్టాడు. దీంతో రాజు పోలీసులను ఆశ్రయించాడు. 

నూజివీడు మండలం అన్నవరం ఎంపియుపి స్కూల్ లో దారుణం జరిగింది. విద్యార్థులు చూస్తుండగానే హెడ్ మాస్టర్ రాజును స్థానిక వ్యక్తి కటారపు జోజి చెంపమీద కొట్టాడు. దీంతో రాజు పోలీసులను ఆశ్రయించాడు. 

గతంలో నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలంలో ఎంపియుపి స్కూల్ లో పనిచేసిన హెడ్మాస్టర్ రాజు సంవత్సరం క్రితం బదిలీపై నూజివీడు మండలం అన్నవరం ఎంపీపీ స్కూల్ కి వచ్చారు.

రెండు నెలల క్రితం నాడు నేడు పనులను స్థానిక పంచాయతీ లో ఉండే ఇద్దరు వ్యక్తులకు ఇచ్చాడు. వారిలో ఒకరైన కటారపు జోజీ పనులు సరిగా చేయకుండా రాజును ఇబ్బందులు పెట్టేవాడు. దీనిమీద అడిగాడని రాజు మీద కక్ష పెంచుకున్నాడు. 

అదే కక్షతో దాడి చేసి నన్ను కొట్టాడు అని రాజు ఫిర్యాదులో పేర్కొన్నాడు. అంతేకాదు 5వ తరగతి పిల్లలు చూస్తుండగా అలా కొట్టడం వల్ల పిల్లల ముందు తన పరువేం కావాలని ఆవేదన వ్యక్తం చేశాడు. 

అయితే హెడ్ మాస్టర్ రాజు కు తనకు సీట్ విషయమై గొడవ అయిందని దాడి చేసిన వ్యక్తి కటారపు జోజి అంటున్నారు. హెడ్మాస్టర్ రాజు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు విద్యార్థున్ని కూడా విచారించారు. 

మా కళ్ళముందు మాస్టర్ ని కింద పడేసి కొట్టాడు మాకు భయమేసి పారిపోయామని వాళ్లు చెప్పడంతో పోలీసులు వారి దగ్గర నుండి కూడా స్టేట్ మెంట్ తీసుకున్నారు. హెడ్మాస్టర్ రాజుకు తగు న్యాయం చేస్తామని రూరల్ ఎస్ఐ రంజిత్ కుమార్ తెలిపారు.  

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్