పశువులను కాసేందుకు వెళ్లిన మహిళపై ఓ కామాంధుడు పట్టపగలే.. అందరూ చూస్తుండగానే లైంగికదాడి చేశాడు. అయితే కళ్లముందు దారుణం జరుగుతున్నా ఎవ్వరూ ఆపడానికి ముందుకు రాలేదు. దారుణమైన ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది.
సంగం : సభ్య సమాజం తలదించుకునేలా పట్టపగలు పదిమంది చూస్తుండగా.. ఓ మహిళపై Sexual assault జరిగింది. nellore జిల్లా మండల కేంద్రమైన సంగం సమీపంలోని ఓ గ్రామంలో శనివారం చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన ఓ married woman సమీపంలోని పొలాల్లో పశువులను మేపేందుకు వెళ్ళింది. మధ్యాహ్నం 3:00 గంటల సమయంలో అక్కడికి దగ్గర్లోని సారా బట్టీల దగ్గర సారా తాగిన ఓ యువకుడు మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. కాపాడాలని ఆమె కేకలు వేసింది. ఆ సమయంలో పలువురు పశువులు కాస్తూ అక్కడే ఉన్నారు. అయినా ఏ ఒక్కరూ ఆకృత్యాన్ని నిలువరించ లేదు. ఛోద్యం చూస్తూ నిలబడ్డారు.
ఈ విషయం తెలిసి ఎలాగో కామాంధుడి భార్యకు తెలిసింది. ఆమె పరుగు పరుగున వచ్చి అడ్డుకోవడంతో బాధితురాలు ప్రాణాలతో బయట పడింది. కొన్నేళ్లక్రితం పశువులను మేపేందుకు వెళ్లిన దివ్యాంగురాలు, ఆ తర్వాత మరో మహిళపై ఇలాగే దాడులు జరిగినా.. పోలీసు కేసులు నమోదు కాలేదు. తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అయినా విచారణ చేస్తామని ఎస్.ఐ నాగార్జున రెడ్డి చెప్పారు.
undefined
ఇదిలా ఉండగా, తెలంగాణలోని హైదరాబాద్ లో మార్చి 21న ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. ఓ కర్కశ తండ్రి కన్నకూతుర్లపైనే Sexual assaultకి ప్రయత్నించాడు. వనస్థలిపురం పరిధిలో ఆలస్యంగా ఆదివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… Nalgonda District దేవరకొండలోని ఓ తండాకు చెందిన వ్యక్తి భార్య, ఐదుగురు సంతానం. వారిలో 20, 13, పదకొండేళ్ల కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వనస్థలిపురం ఓ కాలనీలో వీరు ఉంటున్నారు. అతను ఆటో డ్రైవర్. మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో అతడి కన్ను ఎదిగిన కుమార్తెలపై పడింది. నిత్యం liquor తాగి వచ్చి వారిని లైంగికంగా వేధించసాగాడు. అతడి ప్రయత్నాలను ఎప్పటికప్పుడు wife ప్రతిఘటించేది.
అయితే, ఈనెల 17న ఆమెను కొట్టి ఇంటి నుంచి వేరే గ్రామానికి పంపించాడు. శుక్రవారం రాత్రి ఇంటికి వచ్చి మొదట తన 13 ఏళ్ల కుమార్తె లైంగిక దాడికి ప్రయత్నించాడు. మిగతా కుమార్తెలు అరవడంతో భయపడిన అతడు ఇంటి గేటుకు తాళం వేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అక్క చెల్లెలు అక్కడినుంచి తప్పించుకుని షీ టీమ్ కు, పోలీసులకు ఫోన్ చేశారు. రెండు గంటలైనా స్పందన లేకపోవడంతో తమను పోలీసులు రక్షించలేరని భావించి.. ఆత్మహత్య చేసుకునేందుకు సమీపంలోని చెరువు వద్దకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడున్న మహిళా వారిని చేరదీసి ఓ స్వచ్ఛంద సంస్థ ఫోన్ నెంబర్ ఇచ్చింది.
ఆ ముగ్గురూ ఆ సంస్థ ప్రతినిధికి ఫోన్ చేసి వివరాలు తెలిపారు. సదరు ప్రతినిధి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు ముగ్గురిని ఠాణాకు తీసుకువెళ్లి ఫిర్యాదు తీసుకున్నారు . వారి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. కుమార్తెల పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. శనివారం రాత్రి రిమాండ్కు తరలించారు.