సెల్ఫీ కోసం గూడ్స్ రైలు పైకెక్కడంతో.. కరెంట్ షాక్ తో యువకుడికి తీవ్రగాయాలు..

By SumaBala BukkaFirst Published Jan 27, 2022, 7:05 AM IST
Highlights

బోగీపై నిలబడి సెల్ఫీ దిగేందుకు చేతిని పైకి లేపడంతో పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి విద్యుదాఘాతానికి కింద పడ్డాడు. కిందపడటంతో తలకు గాయం కావడంతోపాటు, శరీరం కూడా తగలబడుతోంది.. ఇది చూసిన అక్కడే ఉన్న మరో యువకుడు బుచ్చయ్య గమనించి వెంటనే రైల్వేస్టేషన్ మాస్టర్ కృపాకర్ కు సమాచారం ఇచ్చాడు. 

పిడుగురాళ్ల : ఆగి ఉన్న goods train పైకెక్కి selfie తీసుకుంటుండగా current shockకి గరై యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పిడుగురాళ్ల పట్టణ రైల్వే స్టేషన్ శివారులో బుధవారం ఈ ఘటన జరిగింది. పట్టణానికి చెందిన కటికం వీరబ్రహ్మం రైల్వేస్టేషన్ సమీపంలో నివసిస్తున్నాడు. తన బైక్ మీద రైల్వేస్టేషన్ వద్దకు వచ్చాడు. అప్పటికే గూడ్స్ రైలు ఆగి ఉండటంతో వెనుక బోగీపైకి ఎక్కాడు.

బోగీపై నిలబడి సెల్ఫీ దిగేందుకు చేతిని పైకి లేపడంతో పైన ఉన్న హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి విద్యుదాఘాతానికి కింద పడ్డాడు. కిందపడటంతో తలకు గాయం కావడంతోపాటు, శరీరం కూడా తగలబడుతోంది.. ఇది చూసిన అక్కడే ఉన్న మరో యువకుడు బుచ్చయ్య గమనించి వెంటనే రైల్వేస్టేషన్ మాస్టర్ కృపాకర్ కు సమాచారం ఇచ్చాడు. రైల్వే ఎస్ఐ ఐలయ్య, ఏఎస్ఐ కె. క్రీస్తుదాసు, కానిస్టేబుల్ సురేష్ లు ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పారు. బాధితుడిని 108లో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండగా, జనవరి 25న హైదరాబాద్ లో ఇలాగే సెల్ఫీ తీసుకోబోయి ప్రాణాల మీదికి తెచ్చుకున్న ఘటన జరిగింది. హైదరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. snake biteకు గురైన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. అతను చేసిన తప్పల్లా.. snakeను పట్టుకున్నాక.. దాన్ని దూరంగా వదిలేయడమో.. స్నేక్ ఫ్రెండ్స్ సొసైటీ వాళ్లకు ఇవ్వడమో చేయకుండా.. హీరోలా ఫొటోలకు ఫోజులివ్వడమే.. అది కూడా పాముకు Lip to lip kiss ఇస్తూ ఫోజులిచ్చాడు. వివరాల్లోకి వెడితే.. 

మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ఆకాష్ (30) నగరానికి వలస వచ్చి wife, ఇద్దరు పిల్లలతో కలిసి గాజుల రామారం డివిజన్ కట్ట మైనమ్మబస్తీలో నివాసం ఉంటున్నాడు. అతడు స్థానికంగా రాళ్లను కొడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. కాగా పాములను పట్టుకోవడంతో దిట్ట అయిన ఆకాష్ ఆదివారం రాత్రి జనవాసాల్లోకి వచ్చిన విషసర్పాన్ని పట్టుకుని మెడలో వేసుకుని ముద్దుపెడుతూ Cell phone ఫొటోలకు ఫోజులిచ్చాడు. 

ఆ తరువాత సర్పాన్ని వదిలిపెట్టాడు. అయితే రాత్రి 9 గంటల ప్రాంతంలో అతను అస్వస్థతకు గురి కావడంతో సూరారంలోని నారాయణ ఆస్పత్రికి తరలించాడు. పాము కాటు వేయడంతోనే అస్వస్థతకు గురైనట్లు, ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. 

కాగా, ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మరణించారు.  nellore జిల్లా నాయుడు పేట మండలం పుదూరు గ్రామ సమీపంలోని తెలుగు గంగ కాల్వలో పడి ఇద్దరు మృతి చెందారు. పుదూరు గ్రామానికి చెందిన కొండారి చైతన్య (25), జగన్ (25) స్నానం చేసేందుకు Telugu Ganga canalలో దిగారు. ప్రమాదవశాత్తు లోపలికి వెళ్లిపోవడంతో ఈత రాక ప్రాణాలు కోల్పోయారు. 

మల్లు విష్టు అనే వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానికులు ఇద్దరి మృతదేహాలను బయటికి తీసి నాయుడు పేట సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మృతుల్లో చైతన్య చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగం చేస్తుండగా, జగన్ డిప్లమా పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. 

click me!