తల్లితో సహజీవనం చేస్తూ... ఆమె కూతురిపై కన్నేసి..

Published : Jul 24, 2020, 07:53 AM ISTUpdated : Jul 24, 2020, 08:01 AM IST
తల్లితో సహజీవనం చేస్తూ... ఆమె కూతురిపై కన్నేసి..

సారాంశం

సదరు మహిళతో సహజీవనం చేస్తూనే.. ఆమె కూతురిపై కన్నేశాడు. ఎవరూ లేని సమయంలో.. మైనర్ బాలిక అనే కనికరం లేకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆమెకు అప్పటికే పెళ్లయ్యింది. ఓ కూతురు కూడా ఉంది. కొంతకాలం క్రితం భర్త దూరం అయ్యాడు. ఈ క్రమంలో ఆమెకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. చివరకు అది సహజీవనానికి దారి తీసింది. అయితే.. ఆమె ప్రియుడు మాత్రం వక్రబుద్ధితో ఆలోచించాడు.

సదరు మహిళతో సహజీవనం చేస్తూనే.. ఆమె కూతురిపై కన్నేశాడు. ఎవరూ లేని సమయంలో.. మైనర్ బాలిక అనే కనికరం లేకుండా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

తన తల్లితో సహజీవనం చేసే ఓ వ్యక్తి  తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ  బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రకాశం జిల్లా అర్ధవీడుకు చెందిన మైనర్ బాలిక ఒంగోలు దిశ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. 

ఒంగోలు గోపాల్‌నగర్‌కు చెందిన సుభానీ.. సుక్కుభాయమ్మ కళాశాలలో పని చేసే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే పదో తరగతి చదువుతున్న ఆమె కూతురితో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆ బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. తల్లికి ఈ విషయం చెబితే ఆమె మద్దతుగా నిలవాల్సిందిపోయి దారుణంగా ప్రవర్తించింది. తన ప్రియుడికే మద్దతుగా నిలిచింది.  రివర్స్ లో కూతుర్నే బెదిరించింది. దీంతో భయపడిన బాధితురాలు.. కొన్ని రోజుల పాటు అమ్మమ్మ ఇంట్లో ఉండిపోయింది. ఆ వృద్ధురాలిచ్చిన ధైర్యంతో పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu