మొన్నే ఎన్నిక.. అప్పుడే ప్రమోషన్: నలుగురు వైసీపీ ఎంపీలకు కీలక పదవులు

Siva Kodati |  
Published : Jul 23, 2020, 10:08 PM ISTUpdated : Jul 23, 2020, 10:15 PM IST
మొన్నే ఎన్నిక.. అప్పుడే ప్రమోషన్: నలుగురు వైసీపీ ఎంపీలకు కీలక పదవులు

సారాంశం

తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా రాజ్యసభ ఎన్నికైన వైసీపీ సభ్యులకు అప్పుడే ప్రమోషన్ వచ్చింది. కీలక కమిటీలను పలువురు కమిటీలకు సభ్యులుగా రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు నియమించారు

తెలుగు రాష్ట్రాల నుంచి కొత్తగా రాజ్యసభ ఎన్నికైన వైసీపీ సభ్యులకు అప్పుడే ప్రమోషన్ వచ్చింది. కీలక కమిటీలను పలువురు కమిటీలకు సభ్యులుగా రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు నియమించారు. వీరిలో వైసీపీ ఎంపీలు కూడా ఉన్నారు.

మోపిదేవి వెంకటరమణారావును బొగ్గు, ఉక్కు స్టాండింగ్ కమిటీ, అయోధ్య రామిరెడ్డిని పట్టణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ, పిల్లి సుభాష్ చంద్రబోస్‌ను పరిశ్రమల స్టాండింగ్ కమిటీ, పరిమల్ నత్వానిని ఐటీ స్టాండింగ్ కమిటీలలో సభ్యులుగా నియమించారు.

కాగా, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇద్దరూ జగన్ కేబినెట్‌లో మంత్రులుగా ఉండి అనంతరం తమ పదవులకు రాజీనామా చేసి రాజ్యసభ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. వీరిద్దరి స్థానంలో పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజు, రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణలకు ముఖ్యమంత్రి జగన్ కేబినెట్‌లో చోటు కల్పించారు.

మరోవైపు టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపికైన సురేశ్ రెడ్డిని ప్రజా ప్రైవేట్ ఫిర్యాదుల స్టాండింగ్ కమిటీ సభ్యులుగా నియమితులయ్యారు. అయితే రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేసిన అతి కొద్దిరోజుల్లో వారికి కీలక కమిటీల్లో చోటు దక్కడంపై వైసీపీ, టీఆర్ఎస్‌ నేతలు చెబుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu