ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి.. పెట్రోల్ పోసి పరార్...

Published : Aug 20, 2021, 12:08 PM ISTUpdated : Aug 20, 2021, 06:56 PM IST
ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పి.. పెట్రోల్ పోసి పరార్...

సారాంశం

రాంబాబు ఆ యువతి గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలు కూడా వీరిద్దరి పెళ్ళికి అంగీకరించాయి. అయితే ఇటీవల యువతి వేరొకరితో మాట్లాడుతోంది అంటూ పెళ్లి రద్దు చేసుకున్నాడు. 

విజయనగరం : పూసపాటిరేగ మండలం చౌడువాడ లో దారుణం చోటుచేసుకుంది. ఓ కిరాతకుడు యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అడ్డుకోబోయిన యువతి అక్క, ఆమె కుమారుడుకి కూడా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురు బాధితులను విజయనగరం జిల్లా ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని నరవకు చెందిన రాంబాబుగా గుర్తించారు.

రాంబాబు ఆ యువతి గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలు కూడా వీరిద్దరి పెళ్ళికి అంగీకరించాయి. అయితే ఇటీవల యువతి వేరొకరితో మాట్లాడుతోంది అంటూ పెళ్లి రద్దు చేసుకున్నాడు. దీంతో రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.  నిన్న రాత్రి రెండు కుటుంబాలను పిలిచి  పోలీసులు రాజీ కుదిర్చారు.

పోలీసుల సూచనతో వివాహం చేసుకునేందుకు యువకుడు అంగీకరించాడు. ఆ తరువాత నిన్న అర్ధరాత్రి సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అనంతరం ఆ గ్రామం నుంచి పరారయ్యాడు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు 

PREV
click me!

Recommended Stories

బస్సులో పరిచయం.. ప్రేమ పేరుతో మోసం రూ.20 లక్షలు బురిడీ | Bus Conductor Accused of Cheating Woman
Employee Holidays : స్టూడెంట్స్ కు 13 రోజులు సరే.. ఉద్యోగులకు దసరా సెలవులు ఎన్నిరోజులో తెలుసా?