అమ్మాయిలతో నగ్నంగా క్షుద్రపూజలు... గుంటూరులో తాంత్రికుడి చేష్టలు వెలుగులోకి...

Published : May 14, 2023, 07:57 AM IST
అమ్మాయిలతో నగ్నంగా క్షుద్రపూజలు... గుంటూరులో తాంత్రికుడి చేష్టలు వెలుగులోకి...

సారాంశం

అమ్మాయిలతో నగ్నంగా క్షుద్రపూజలు చేయిస్తున్న ఓ తాంత్రికుడి వ్యవహారం గుంటూరు జిల్లాలో బయటపడింది. 

అమరావతి :     అమ్మాయిలతో నగ్నంగా క్షుద్రపూజలు చేయిస్తున్న ఓ తాంత్రికుడి ఉదంతం గుంటూరులో బయటపడింది.ఓ మహిళ సహకారంతో అమ్మాయిలకు డబ్బుల ఆశచూపి పూజలు చేస్తున్నాడు ఈ కేటుగాడు. అతడి చేతిలో మోసపోయిన యువతులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ క్షుద్రపూజల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  

వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు  గ్రామానికి చెందిన ఓ వ్యక్తి  మంత్రతంత్రాలతో డబ్బులు సంపాదించవచ్చని అమాయకులను నమ్మించేవాడు. ఈ మాయమాటలు నమ్మినవారితో క్షుద్రపూజలు చేయించేవాడు. ఇలా చిలకలూరిపేటకు చెందిన ఓ మహిళ కూడా ఈజీగా డబ్బులు సంపాదించాలని భావించి సదరు తాంత్రికుడిని ఆశ్రయించింది.  సామాజిక మాధ్యమాల ద్వారా తాంత్రికుడితో పరిచయం పెంచుకున్న మహిళ పూర్తిగా అతడి మాయలో పడిపోయింది.  

చిలకలూరిపేట మహిళ సాయంతో అమ్మాయిలకు వలవేసి క్షుద్రపూజలు చేయసాగాడు తాంత్రికుడు.ఇలా కర్నూల్ జిల్లాకు చెందిన కొందరు అమాయక అమ్మాయిలకు డబ్బులు ఆశచూపి క్షుద్రపూజలు కోసం తీసుకువచ్చారు. వారితో పదిరోజుల పాటు విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో క్షుద్రపూజలు నిర్వహించారు. అమ్మాయిల ఒంటిపై నూలుపోగు లేకుంగా పూర్తి నగ్నంగా పూజలో కూర్చోబెట్టేవారు. ఇలా పదిరోజుల పాటు పూజలు నిర్వహించి ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండానే తిరిగి కర్నూల్ కు పంపించారు. 

Read More  ఒంగోలులో కాలిపోయిన స్థితిలో మహిళ మృతదేహం.. పుర్రె, ఎముకలు లభ్యం..

అయితే క్షుద్రపూజలో పాల్గొంటే ఇస్తామన్న డబ్బులు ఇవ్వకపోవడంతో ఇద్దరు యువతులు పొన్నెకల్లుకు వెళ్లి తాంత్రికున్ని నిలదీసారు. దీంతో మహిళ, తాంత్రికుడు ఇద్దరు ఆ అమ్మాయిలను బలవంతంగా ఓ వాహనంలో ఎక్కించి ఎక్కడికో తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. కానీ గోరంట్ల సమీపంలో వాహనం ఆగిన సమయంలో తప్పించుకున్న అమ్మాయిలు పోలీసులకు ఫోన్ చేసారు. దీంతో పోలీసులు ఇద్దరు అమ్మాయిలను తాంత్రికుడి బారినుండి కాపాడారు. 

బాధిత యువతుల నుండి వివరాలు సేకరించిన పోలీసులు మహిళను అరెస్ట్ చేసారు. తాంత్రికుడు మాత్రం తప్పించుకున్నాడు. అతడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇలాంటి దొంగబాబాలు,తాంత్రికుల మాయమాటలు అమ్మాయిలు నమ్మవద్దని పోలీసులు సూచించారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?