ఎందుకు తాగావ్.. అన్నందుకు కొట్టి, మెడకు తాడు బిగించి.. భర్త చేసిన ఘాతుకం.. !!

Published : Mar 30, 2021, 09:44 AM IST
ఎందుకు తాగావ్.. అన్నందుకు కొట్టి, మెడకు తాడు బిగించి.. భర్త చేసిన ఘాతుకం.. !!

సారాంశం

మద్యం తాగి ఇంటికి ఆలస్యంగా రావడంపై ప్రశ్నించిన భార్యను కిరాతకంగా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన రామభద్రపురం మండలం మెరక వీధిలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రమేష్ పన్నెండేళ్ల కిందట వెంకటలక్ష్మిని వివాహం చేసుకున్నాడు. వీరికి పిల్లలు లేరు. ఆటో నడుపుతూ పోషిస్తున్నాడు. రమేష్ ఆదివారం 9:30 గంటలకు తాగి ఇంటికి వచ్చాడు. భార్య ఎందుకు తాగావ్ అని ఆయనతో గొడవ పడింది.

దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఆవేశానికి గురైన రమేష్ దగ్గర్లో ఉన్న కర్ర తో ఆమె తలపై గట్టిగా కొట్టాడు. అపస్మారక స్థితికి వెళ్లిన ఆమె మెడకు తాడు బిగించి వేలాడదీశాడు. ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు, స్థానికులను నమ్మించే ప్రయత్నం చేశాడు.

సమాచారం అందుకున్న డిఎస్పి సుభాష్, సిఐ అప్పలనాయుడు, ఎస్ఐ కృష్ణమూర్తి ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేశారు. దుస్తులకు రక్తపు మరకలు ఉండడంతో భర్త విచారించడంతో హత్య చేసినట్లు అంగీకరించాడు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు.

రాజమండ్రిలో ఓ గ్రానైట్ పరిశ్రమలో పనిచేస్తున్న లక్ష్మి తల్లి రామలక్ష్మి, సోదరుడు శ్రీనివాసరావు గ్రామానికి చేరుకుని బోరున విలపించారు. కుమార్తెను అల్లుడే హత్య చేశాడని బాధిత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పూర్తిస్థాయి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

PREV
click me!

Recommended Stories

Deputy CM Pawan Kalyan Speech: కాకినాడ లో డిప్యూటీ సీఎం పవన్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
CM Chandrababu Spech: మీ భూమి మీ హక్కు రాజ ముద్రతో పట్టా ఇస్తా | Asianet News Telugu